Google Pay: యూజర్లకు గూగుల్ పే హెచ్చరిక, ఆ యాప్స్ ఉపయోగిస్తుంటే వెంటనే డిలీట్ చేయండి

గూగుల్ పే యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్ ఉపయోగించవద్దని, ఈ యాప్‌ను ఓపెన్‌లోనే ఉంచవద్దని గూగుల్ తెలిపింది. సైబర్ నేరగాళ్లు యూజర్ల మొబైల్‌లోని గూగుల్ పే నుంచి ఆర్ధిక లావాదేవీల వివరాలు సేకరించి అకౌంట్ ఖాళీ చేస్తున్నట్టుగా గూగుల్ గుర్తించింది. 

Telugu Mirror : ప్రపంచమంత బ్యాంకింగ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. లావాదేవీలు అన్ని డిజిటల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న చిన్న మార్కెట్లలో అరటిపండు నుండి భారీ షాపింగ్ మాల్స్ వరకు అందరూ, ఫోన్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా సులభంగా చెల్లించడానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఉపయోగిస్తున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్‌లో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉన్నా మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల నేరగాళ్లు భారీగా స్కాం చేయడానికి వీలుగా ఉంటుంది. దీని కారణంగా, ప్రపంచంలోని అత్యుత్తమ UPI యాప్‌లలో ఒకటైన Google Pay, దాని వినియోగదారులకు కొన్ని హెచ్చరికలు చేసింది.

గూగుల్ పే యాప్ వినియోగించటానికి అన్ని స్క్రీన్ షేరింగ్ యాప్‌లను మూసివేయాలని తెలిపింది. లావాదేవీ చేసినప్పుడు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దని స్పష్టం చేసింది. Screen Share, AnyDesk, TeamViewer వంటి స్కీన్ షేరింగ్ యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వాస్తవానికి వీటిని ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు రిమోట్ యాక్సిస్ ద్వారా ఉపయోగిస్తుంటారు. వీటి ద్వారా ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్లలో దుర్వినియోగం జరగకుండా వినియోగదారులు చూసుకోవాలి.

Best Broadband Plans : Best Broadband Plans with 100Mbps Unlimited Data Speed.
Image Credit : My Smart Price

Also Read: Black Friday Sale 2023: రూ.8000 తగ్గింపుతో అద్భుతమైన iPhone15. బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఇంకా మరెన్నో..

గూగుల్ తో లావాదేవీలు చేయండి :

UPI బదిలీల కోసం, Google Pay అత్యంత సురక్షితమైన మరియు అత్యంత విశ్వసనీయ యాప్‌లలో ఒకటి. అందుకే చాలా మంది ఇష్టపడుతున్నారు. కృత్రిమ మేధస్సు మరియు వినియోగదారులకు అధిక భద్రతను ఉపయోగించడం ద్వారా, ఇది మోసాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇది మోసపూరిత ఒప్పందాలను వెంటనే కనుగొనడంలో సహాయపడుతుంది. మీరు Google Payని ఉపయోగిస్తున్నప్పుడు మీరు స్క్రీన్ షేరింగ్ యాప్‌ను ఎప్పటికీ ఉపయోగించకూడదు అని తెలిపింది.

స్క్రీన్ షేరింగ్ యాప్‌లు ఎలా పని చేస్తాయి :

సాధారణంగా వీటిని రిమోట్ వర్కింగ్ కోసం లేదా ఫోన్, కంప్యూటర్లలో ఏదైనా సమస్య ఉంటే మరో చోటు నుంచి దాన్ని సరిచేసేందుకు ఉపయోగిస్తుంటారు. ఎనీ డెస్క్ (Any Desk) , టీమ్ వ్యూయర్ (Team Viewer) వంటివి ఎక్కువగా ఇందుకోసం వినియోగిస్తుంటారు. ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు స్క్రీన్ షేరింగ్ యాప్ (Screen Sharing Apps) ల ద్వారా యూజర్లు ఫోన్ నుంచి డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు, ఏటీఎం (ATM) , డెబిట్ కార్డుల (Debit Cards) వివరాలు తీసుకోవడంతో పాటు ఓటీపీ లతో బ్యాంకు అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు.

స్కీన్ షేరింగ్ యాప్స్ ఎందుకు వాడకూడదు :

– స్కీన్ షేరింగ్ ద్వారా సైబర్ నేరగాళ్లు మీ ఫోన్ నుంచి డిజిటల్ చెల్లింపులకు మీ తరఫున యాక్సిస్ ఇవ్వటాన్ని నిరోధించేందుకు.

– మీ ఫోన్ లేదా కంప్యూటర్లలో ఉంచిన ఏటీఎమ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలు మోసగాళ్లు తెలుసుకునేందుకు వీలు కల్పించకుండా చేసేందుకు.

– సైబర్ నేరగాళ్లు మీ ప్రమేయం లేకుండా ట్రాన్సాక్షన్లు చేసినట్లయితే ఆ సమయంలో వచ్చే ఓటీపీలను మీ ఫోన్ లేదా టాబ్లెట్ నుంచి తెలుసుకుని డబ్బును దొంగలించడాన్ని ఆపేందుకు.

– ఈ ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు స్కీన్ షేరింగ్ యాప్స్ ఫోన్లలో డిలీట్ చేయాలి. అనవరసమైన యాప్స్ ఫోన్లలో లేకుండా చూసుకోవాలి.

Comments are closed.