Hyundai Creta N Line : హ్యుందాయ్ నుంచి మరో మోడల్.. స్పోర్టీ లుక్‌లో మతి పోగొడుతున్న SUV..

ప్రస్తుతం మిడ్‌ రేంజ్‌ కార్‌ మార్కెట్‌లో అగ్రగామిగా నిలుస్తున్న హ్యుందాయ్ క్రెటాలో ఇప్పుడు ఎన్‌ లైన్‌ మోడళ్లు మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి.

Telugu Mirror : భారత మార్కెట్లో హ్యుందాయ్‌ క్రెటా ఎస్‌యూవీకి భారీ డిమాండ్‌ ఉంది. ఆకట్టుకునే డిజైన్‌, మతి పోగెట్టే ఫీచర్లు, అద్భుతమైన పర్ఫామెన్స్‌కు హ్యుందాయ్‌ మోటార్స్‌కు భారీ సేల్స్‌ను తెచ్చిపెడుతుంది. కాగా దేశంలో టాప్‌ 5 కార్ల సేల్స్‌లో హ్యుందాయ్‌కు ఎప్పుడూ చోటుంటుంది. ఈ క్రమంలో ఈ కొరియన్‌ సంస్థ నుంచి నేడు Creta N Line మోడల్‌ లాంచ్‌ అయింది. స్టాండర్డ్​ క్రేటా ఎస్​యూవీతో పోల్చితే ఈ హ్యుందాయ్​ క్రేటా​ ఎన్​ లైన్​ బంపర్స్​, గ్రిల్​లో స్వల్పంగా మార్పు కనిపిస్తుంది. పైగా దీనికి రెడ్​ యాక్సెంట్స్​ వస్తున్నాయి. 18 ఇంచ్​ రీ-డిజైన్డ్​ అలాయ్​ వీల్స్​, రేర్​ స్పాయిలర్​, డ్యూయెల్​ ఎగ్జాస్ట్​ టిప్స్​ వంటివి కూడా లభిస్తున్నాయి

హ్యుందాయ్ క్రెటా N లైన్ ఎస్‌యూవీ(Hyundai Creta N Line Launch)ని సంస్థ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. ఇది సాధారణ క్రెటా యొక్క SX(టెక్) మరియు SX(O) ట్రిమ్‌ల ఆధారంగా రూపొందించారు. స్పెసిఫికేషన్స్‌ పరంగా గట్టి సస్పెన్షన్, అప్‌డేటెడ్‌ స్టీరింగ్ డైనమిక్స్ (Steering Dynamics) మరియు బీఫియర్ ఎగ్జాస్ట్ నోట్‌తో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంటుంది.

Also Read : OnePlus : వన్‌ప్లస్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్.. రిలీజ్ ఎప్పుడంటే!

క్రెటా ఎన్ లైన్ కారు ఆరు కలర్లలో లభిస్తుంది. బ్లాక్ రూఫ్ తోపాటు మూడు డ్యుయల్ టోన్ ఎక్స్‌టీరియర్ థీమ్స్ తో వస్తాయి. అట్లాస్ వైట్, అబ్యాస్ బ్లాక్, టైటాన్ గ్రే మ్యాట్టె, థండర్ బ్లూ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్, షాడో గ్రే విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్, అట్లాస్ వైట్ విత్ అబ్యాస్ బ్లాక్ రూఫ్ ఆప్షన్లలో లభిస్తాయి

Hyundai Creta has now launched N line models in the market.

ఈ హ్యుందాయ్ (Hyundai) ​ క్రేటా ఎన్​ లైన్​ ఎస్​యూవీలో రెండు వేరియంట్లు ఉంటాయి. అవి ఎన్​8 మరియు ఎన్​10. ఈ రెండింటికీ ఒకటే ఇంజిన్​ వస్తోంది. అది 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​. ఇది 158 హెచ్​పీ పవర్​ని, 253 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, డీసీటీ గేర్​బాక్స్ (DCT Gearbox)​ ఆప్షన్స్​ ఉన్నాయి. 0-100 కేఎంపీహెచ్​ని 8.9 సెకన్లలో అందుకుంటుంది.

ఇక ఈ హ్యుందాయ్​ కారులో బోస్​ మ్యూజిక్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, 360 డిగ్రీ సరౌండ్​ కెమెరా, పానారోమిక్​ సన్​రూఫ్​, ప్యాడిల్​ షిఫ్టర్స్​, డ్యూయెల్​ డాష్​ కెమెరా, పవర్డ్​ డ్రైవర్​ సీట్​, లెవల్​ 2 అడాస్​ సూట్ లు​ కూడా ఉన్నాయి.

Also Read : AP TET 2024 Results ఏపీ టెట్ ఫలితాలు విడుదల, ఎప్పుడో తెలుసా? డీఎస్సి పరీక్ష కొత్త షెడ్యూల్ తెలుసుకోండి ఇలా!

కాగా హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ఎస్‌యూవీ(Hyundai Creta N Line SUV Bookings)ని సంస్థ రూ. 16.82 లక్షల ధర(ఎక్స్-షోరూమ్)తో ప్రవేశపెట్టింది. కొనుగోలు కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ. 25,000 అడ్వాన్స్ బుకింగ్ డబ్బులు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Comments are closed.