Motorola Edge 50 Pro : మోటోరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్‌.. కర్వ్‌డ్‌ డిస్‌ప్లేతో పాటు AI ఫీచర్స్‌..

మోటోరోలా ఎడ్జ్ 50ప్రో ఏప్రిల్ 3న ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫాంటోన్ సర్టిఫైడ్ 6.7 ఇంచెస్ కర్వ్ పోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది.

Motorola Edge 50 Pro : ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ మోటోరోలా (Motorola) దూకుడుపెంచింది. వరుసగా కొత్త స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేసిన ఈ సంస్థ తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో బెస్ట్ ఫోన్ ఇది. మోటోరోలా ఎడ్జ్ 50ప్రో (Motorola Edge 50 Pro)  ఏప్రిల్ 3న ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫాంటోన్ సర్టిఫైడ్ 6.7 ఇంచెస్ కర్వ్ పోల్డ్ డిస్‌ప్లే వస్తుంది.

Also Read : SBI Banking Services : ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్.. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, యోనో సేవలకు అంతరాయం..!

Motorola Edge 50 Pro స్పెసిఫికేషన్‌లు :

ఈ స్మార్ట్‌ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. టచ్ శాంప్లింగ్ రేటు 240 Hz మరియు 1800 నిట్స్ బ్రైట్ నెస్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 CPU మీద పనిచేస్తుంది. Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఈ మొబైల్ మూడు రంగుల్లో లభ్యం కానుంది. నలుపు, గులాబీ మరియు టీల్ రంగులలో అందుబాటులో ఉంది.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ప్రాథమిక సెన్సార్ (f/1.4). 6X ఆప్టికల్ జూమ్ మరియు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా సిస్టమ్ ఉంది. కర్వ్డ్ పంచ్ హోల్ డిస్‌ప్లేతో వస్తుంది.125 వాట్ల వైర్డ్ చార్జింగ్ లేదా 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో ఈ ఫోన్ వస్తుంది.

Also Read : Insurance Plan : కేవలం రూ. 575 తో రూ. 25 లక్షల ప్రమాద బీమా.. అదిరిపోయే పాలసీ ఇప్పుడే చేరండి..!

ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఆటోఫోకస్ ట్రాకింగ్, ఏఐ ఫోటో మాస్టరింగ్, టిల్ట్ మోడ్ వంటి ఫీచర్లు కెమేరాలో ఉన్నాయి. అంతేకాకుండా సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం కూడా  32 మెగాపిక్సెల్ కెమేరా ఇస్తోంది కంపెనీ. దాంతో వీడియో కాలింగ్ మరింత ప్రత్యేకంగా ఉంటుంది మరియు సెల్ఫీలు చాలా అద్భుతంగా వస్తాయి.

Motorola Edge 50 Pro Smartphone

 

Comments are closed.