Best Phones Under 30K : రూ. 30,000 లోపు ఉన్న బెస్ట్ 5G ఫోన్లు ఇవే మీరు ఓ లుక్కేయండి.

రూ. 30,000 ధరలోపు కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అత్యుత్తమ స్పెసిఫికేషన్లతో అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని విభాగాల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఉన్నాయి. రూ. 30వేలలోపు ఏ స్మార్ట్‌ఫోన్‌లు బెస్ట్‌గా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

Telugu Mirror : భారతదేశంలో ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు రూ.20 వేల నుంచి రూ.30 వేల ధరకు పెర్ఫామెన్స్, మంచి కెమెరాలతో కూడిన స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరుతో మొబైల్‌లను విడుదల చేస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో రూ.30 వేల లోపు సెగ్మెంట్ మొబైల్స్ కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మీరు కూడా తక్కువ బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అయితే ఆ రేంజ్‌లో బెస్ట్ అయిన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రూ.30 వేల లోపు అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లు ఇవే.

Realme 11 5G :

Take a look at the best 5G phones under Rs.30,000.
Image Credit : OnlineBhasker

రియల్ మీ 11 5G స్మార్ట్ ఫోన్ MediaTek Dimension 6100 Plus ప్రాసెసర్‌ తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ యొక్క ప్రాముఖ్యత మరియు అద్భుతమైన వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 8 జీబీ + 128 జీబీతో పాటు 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ‘గ్లోరీ హాలో’ డిజైన్‌తో నలుపు, బంగారపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 17,999 గా ఉంది.

OnePlus Nord CE 3 Lite 5G :

Take a look at the best 5G phones under Rs.30,000.
Image Credit : One Plus Mobile

6.72 ఇంచుల Full HD+ LCD డిస్‍ప్లేతో వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ వస్తుంది. వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్‍లో స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (Android 13) ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13.1 పై రన్ అవుతుంది.108 మెగాపిక్సెల్ సామ్‍సంగ్ HM6 ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ ఫోన్‍ కలిగి ఉంది. 67 వాట్స్‌ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 19,999 గా ఉంది.

Realme 11 Pro : 

Take a look at the best 5G phones under Rs.30,000.
Image Credit : Fonearena

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఇటీవల రిలీజ్‌ చేసిన రియల్‌ మీ 11 ప్రో ఫోన్‌ గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటుంది. 67 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో పని చేసే ఈ ఫోన్‌ గేమింగ్‌ ప్రియులను ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 23,999 గా ఉంది.

Realme 11 Pro Plus : 

Take a look at the best 5G phones under Rs.30,000.
Image Credit : westlanduae

రియల్మీ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ కూడా మంచి ఫీచర్లను కలిగి ఉంది. 200 మెగా పిక్సెల్ కెమెరాతో ఫొటొగ్రఫీకి ఈ ఫోన్ చక్కగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగా పిక్సెల్ కలిగి ఉంది. 6.7 అంగుళాల కర్వ్డ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 27,999 గా ఉంది.

Redmi Note 12 pro plus :

Take a look at the best 5G phones under Rs.30,000.
Image Credit : Techno

ఈ రెడ్‌మి 12 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు 5000 mAh శక్తివంతమైన బ్యాటరీని పొందుతారు. ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన ప్రాసెసర్ కోసం MediaTek డైమెన్షన్ 1080 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 8GB+256GB మరియు 12GB+256GB రెండు వేరియంట్‌లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 27,500 గా ఉంది.

Comments are closed.