Vivo V29e : వివో నుండి అదిరిపోయే ఫీచర్స్ తో Vivo V29e, కిరాక్ స్పెసిఫికేషన్స్ తో ఈరోజే లాంచ్.

Telugu Mirror : Vivo V29e ఈ రోజు అనగా ఆగస్ట్ 28న భారతీయ మార్కెట్ లోకి రానున్నది. ఫోన్ అధికారికంగా విడుదలకు ముందు గతంలో పలు నివేదికలు Vivo V29e యొక్క కలర్ ఆప్షన్స్, డిజైన్ వివరాలు మరియు డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పటికే వెల్లడించాయి. ఇప్పుడు, వెలువడిన నివేదికలు భారతీయ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ యొక్క అంచనా వేసిన ధర మరియు స్టోరేజ్ ఎంపికలపై ఖచ్చితమైన సమాచారం అందించింది

The Techoutlook నుండి ఇటీవల వెలువడిన నివేదిక ప్రకారం, రాబోయే Vivo V29e స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఎంపికలతో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని  తెలుస్తోంది. మొదటి మోడల్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఈ వేరియంట్ ధర రూ. 26,999. మరొక వేరియంట్ వచ్చేసి 8GB RAM మరియు బిగ్ 256GB స్టోరేజ్ సామర్థ్యం కలిగి ఉంది, భారతదేశంలో కొంచెం ఎక్కువ ధర వద్ద రూ. 28,999 లభిస్తుంది.మీడియా వెలువరించిన ప్రకారం, Vivo V29e స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దానితో పాటుడిస్ ప్లే పైభాగం మధ్యలో పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. Vivo V29e స్మార్ట్‌ఫోన్ రెండు విభిన్న కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. అందులో ఆర్కిటిక్ రెడ్ మరియు ఆర్కిటిక్ బ్లూ ఉన్నాయి.

Image Credit : TV9 Kannada

Apple iphone15 pro : ఐఫోన్ ప్రియులకు కొత్త సిరీస్ లో ఆకట్టుకునే రంగులతో అందరీ అంచనాలను మించనుంది, త్వరలో విడుదల

కెమెరా అమరికల పరంగా, రాబోయే Vivo V29e రెండు వృత్తాకార ఐలాండ్ లో ఉంచబడిన డ్యూయల్ బ్యాక్ కెమెరా కంపోజ్ ను కలిగి ఉంటుంది. ప్రైమరీ కెమెరా 64-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉండి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా బ్యాక్ ప్యానెల్‌లో దాన్ని కలిగి ఉంటుంది. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌లను ఫెసిలిటేట్ చేయడానికి, ఫోన్‌లో ఆకర్షణీయంగా 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అమర్చబడి ఉంటుంది.

Vivo V29e 6.78- అంగుళాల వంపు కలిగిన AMOLED డిస్‌ప్లేను కలిగి వస్తుందని మరొక నివేదిక తెలిపింది. Vivo V29e స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ ను 1,300 nits అత్యధిక ప్రకాశవంతమైన 360Hz PWM డిమ్మింగ్ సామర్ధ్యం మరియు 93.3శాతం అసాధారణమైన స్క్రీన్. హ్యాండ్ సెట్ కి శక్తినివ్వడం కోసం స్నాప్‌డ్రాగన్ 695 SoC, మృదువైన పనితనం కోసం 8GB RAM అందుబాటులో ఉంది. ఈ పరికరం 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో బలమైన 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.