Toy Business : ఇంట్లోనే ఉంటూ సంపాదించే ఛాన్స్.. సొంత వ్యాపారమే హాయి..

Telugu mirror : మీరు నిరుద్యోగులా? అయితే మీరు స్వయం కృషితో ఎదిగి డబ్బు సంపాదించండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ప్రస్తుత కాలంలో పెరిగిన జీవన విధానంలో ఇంట్లో ఉన్న భార్యా భర్తలు ఉద్యోగం చేస్తేనే వారి ఆర్ధిక అవసరాలు తీరుతున్నాయి. మీరు అదనపు ఆదాయం కోసం చూస్తున్నారా. అయితే మీరు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఒక చిన్న బిజినెస్ ఐడియా ను ఫాలో అయ్యి మీరు సురక్షిత లాభాన్ని పొందవచ్చు.మీరు ఉద్యోగస్తులు ఐతే మీకు వచ్చే జీతంతో పాటు ఇతర ఆదాయాన్ని అందించే ఒక వ్యాపారాన్ని మేము మీకు చెప్పబోతున్నాం.తక్కువ పెట్టుబడులను పెట్టి ఎక్కువ రాబడిని పొందవచ్చు.

Panchang : నేటి పంచాంగం.. 03 జూలై 2023 వివరాలు తెలుసుకోండి..

ప్రస్తుతం భారత దేశంలో బొమ్మల పరిశ్రమకు గిరాకీ బాగానే ఉంది.యూరప్ మరియు అమెరికా దేశాలకు చెందిన పిల్లలు మన దేశం నుంచి ఎగుమతి అయిన బొమ్మలతోనే ఆడుకుంటున్నారు.ఈ బొమ్మల పరిశ్రమలోకి ఇతర వ్యాపారాలతో పోల్చుకుంటే చాలా తక్కువ మొత్తంతో అడుగు పెట్టి ఎక్కువ లాభాలనే పొందవచ్చు.సాదరణంగా బొమ్మల మార్కెట్ మీద మనం చైనాతో పోల్చుకుంటే చైనాదే పైచేయి.కానీ భారత ప్రభుత్వం చైనాను అధిగమించి, ఇతర దేశాలకు ఎగుమతులు చెయ్యాలని అనుకుంటుంది.

ఈ క్రమంలో చాలా వరకు ప్రభుత్వం చేస్తున్న కృషి విజయ వంతం అవుతున్నది.బొమ్మల పరిశ్రమకు ఎప్పుడు తక్కువ డిమాండ్ ఉండదు.ఈ పరిశ్రమలో ల్లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు, దాదాపు 45 వేల వరకు సరిపోతుంది.మెత్తటి బొమ్మలు మరియు టెడ్డిబేర్ ల వంటి బొమ్మలను మనం ఇంట్లో ఉండే తయారు చెయ్యవచ్చు.ముందుగా మనకు దూది లాంటి మెత్తటి ముడి సరుకు కోసం రూ.15,000 దాకా ఖర్చు అవుతుంది, ఒక క్లాత్ కటింగ్ మెషిన్ మరియు కుట్టు మెషిన్ అవసరం.క్లాత్ కటింగ్ మెషిన్ దాదాపు 4 వేల నుంచి 5 వేల వరకు ఉంటుంది.అలానే కుట్టు మెషిన్ 9 వేల నుంచి 11 వేల మధ్యలో ఉంటుంది.

Asus Zen Fone 10 : గ్లోబల్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్..యూరప్ లో లాంఛ్..

ఒక పది వేల వరకు ఖర్చులు అవుతాయి.మీరు కొన్న 15 వేల సరుకుతో రమారమి ఒక 100 బొమ్మలను తయారు చెయ్యవచ్చు.ఒక్కో బొమ్మ 500 వరకు మార్కెట్ లో ధర పలుకుతుంది. ఇలా 100 బొమ్మలను అమ్మితే మనం రూ.50,000 వరకు సంపాదించవచ్చు. కొన్నేళ్ల క్రితం భారత దేశంలోని బొమ్మలన్నీ 85 శాతం వరకు వేరే దేశాల నుండి దిగుమతి అయినవే కానీ మూడేళ్లలో బొమ్మల దిగుమతులు 70 శాతం తగ్గాయి.

మన దేశం నుంచే అమెరికా, యూరోప్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలోని పిల్లల చేతిలోకి బొమ్మలు చేరుతున్నాయి.భారత ప్రభుత్వం చెప్పిన గణాంకాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు $371 మిలియన్ల సరుకు మన దేశంలో దిగుమతి అయ్యింది.తర్వాత 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేవలం $110 మిలియన్ల సరుకు మాత్రమే దిగుమతి అయ్యింది.వీటితో పాటు భారత దేశం నుంచి ఎగుమతులు 60 శాతం పెరిగాయి.

Leave A Reply

Your email address will not be published.