వాట్సాప్‌ యూజర్లకు అదిరిపోయే అప్డేట్, ఒకే యాప్‌లో రెండు అకౌంట్స్‌

సాధారణంగా ఒకే ఫోన్ లో చాలా మంది ఒకే వాట్సాప్ ఖాతాను ఉపయోగిస్తారు. మరి ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం అంటే అందులో ఖచ్చితంగా వాట్సాప్ యాప్ ఉంటుంది. అయితే ఒకే వాట్సాప్ లో వినియోగదారులు రెండు అకౌంట్స్ ని మెయింటైన్  చేయడం కష్టంగా ఉంటుంది. వినియోగదారులు ఒకే స్మార్ట్ ఫోన్ లో అనేక ఖాతాలను యాక్సెస్ (Access) చేయడాన్ని సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్‌ను (Feature) మెటా యాజమాన్యంలోని వాట్సాప్  విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. Meta కంపెనీ CEO అయిన మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్‌లో “డ్యూయల్ వాట్సాప్ అకౌంట్” ఫీచర్‌ను అధికారికంగా చెప్పారు. ఇది మరికొద్ది రోజుల్లో ప్రారంభించబడుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read : వన్‌ ప్లస్ నుంచి సరికొత్తగా ప్యాడ్ గో టాబ్లెట్, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ప్రస్తుతానికి, అనేక వాట్సాప్ (Whatsapp) ఖాతాలను వాడాల్సినప్పుడు వినియోగదారులు ఒకే పరికరంలో అనేక ఖాతాల నుండి పదేపదే లాగిన్ మరియు లాగ్ అవుట్ చేయవలసి వస్తుంది లేదా అదనపు ఫోన్ లేదా టాబ్లెట్‌ను ఉపయోగించవలసి వస్తుంది. ఈ సేవను ఉపయోగించుకోవడానికి వినియోగదారులకు రెండవ ఫోన్ నంబర్ అవసరం. స్మార్ట్ ఫోన్ కి మల్టీ-సిమ్ సామర్థ్యం లేదా ఇ-సిమ్ కనెక్టివిటీకి సపోర్ట్ ఉండడం చాలా అవసరం. రెండు ఫోన్ నంబర్లు లేకుండా ఒక పరికరంలో రెండు వాట్సాప్ ఖాతాలను సెటప్ చేయడం వీలు కానీ పని. వాట్సాప్ సాధారణంగా SMS ద్వారా వన్-టైమ్ పాస్‌కోడ్‌ను (OTP) అందిస్తుంది, కాబట్టి దాన్ని పొందడానికి ఈ అదనపు నంబర్ ఉపయోగించాల్సి వస్తుంది.

An exciting update for WhatsApp users, two accounts in the same app
Image Credit : Daily Mail

Also Read :నమో భారత్ రైలులో ప్రధాని ప్రయాణం, విద్యార్థులతో ముచ్చట్లు

ఒకే స్మార్ట్ ఫోన్ లో రెండు వాట్సాప్ ఖాతాలు ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ముందుగా మీరు వాట్సాప్ సాఫ్ట్‌వేర్ లేటెస్ట్ వర్షన్ ని అప్డేట్ చేసుకోండి.

2. యాప్ ఓపెన్ చేయగానే, సెట్టింగ్‌ల మెనుకి నావిగేట్ చేయడానికి పైన ఎడమ మూలలో ఉన్న మూడు డాట్స్ ని క్లిక్ చేయండి.

3.సెట్టింగ్‌లలో మీ పేరు పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది.

4. దాన్ని క్లిక్ చేస్తే “Add Account” అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఎంచుకోండి.

5. మీ రెండవ ఫోన్ నంబర్‌ను నమోదు చేయండి మరియు మీకు జారీ చేసిన కోడ్‌కు  ఎంటర్ చేసి కన్ఫర్మ్  చేసుకోండి.

6. మీరు మీ పేరు ప్రక్కన ఉన్న యారో ని కన్ఫర్మ్  చేసి సెటప్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్స్ ని ఈజీగా మారవచ్చు.
7. అందుబాటులో ఉన్న ఖాతాల జాబితా నుండి మీరు ఉపయోగించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి.

ఈ ఫీచర్ కారణంగా వినియోగదారులు ప్రతి ఖాతా నోటిఫికేషన్ సెట్టింగ్‌లను వ్యక్తిగతంగా సవరించగలుగుతారు. సందేశాలను తీసేయడం, మ్యూట్ చేయడం లేదా చాట్‌లను ఆర్చీవ్ చేయడం లేదా కొన్ని తెలియని కాంటాక్ట్స్ ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్స్ లు ప్రతి ఖాతాకి వర్తిస్తాయి.

Comments are closed.