Vaastu Tips : ఏ రంగు చీమలు ఇంటి లోపలకు వస్తే అదృష్టం కలుగుతుంది. వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది అంటే

చీమలు అదృష్టంను తీసుకు వస్తాయని చాలామందికి తెలియదు. చీమలు రెండు రకాలు ఉంటాయి. ఎర్ర చీమలు మరియు నల్ల చీమలు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ రంగు చీమలు ఇంట్లోకి వస్తే అదృష్టాన్ని తీసుకు వస్తాయో తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి ఇంట్లో కి చీమలు రావడం సహజం. చీమలు ఎక్కువగా వంట గదిలో ఉంటాయి. దీని కారణం తీపి పదార్థాలు ఉంటాయి కాబట్టి. చీమలు (ants) ఇంట్లో కనబడగానే అందరూ చేసే పని వాటిని మందు వేసి చంపడం చేస్తుంటారు.

అయితే

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ రంగు చీమలు ఇంట్లోకి వస్తే అదృష్టాన్ని తీసుకు వస్తాయో తెలుసుకుందాం.

నల్ల చీమలు :

నల్ల చీమలు (Black ants) ఇంట్లోకి లైన్ కట్టి వచ్చినట్లయితే సంతోష పడాలి. ఎందుకనగా ఈ విధంగా నల్ల చీమలు లైన్ లో వస్తే ఆ ఇంటికి అదృష్టం ను తీసుకువస్తాయి అని అర్థం. నల్ల చీమల వల్ల ఆ ఇంట్లోకి ధన లాభం కలుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. దీంతోపాటు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని, కొత్త వ్యాపారాలు వంటివి ప్రారంభిస్తారని, ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్ లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

కుప్పలు కుప్పలుగా నల్ల చీమలు ఇంట్లో ఉన్నట్లయితే అంత మంచిది కాదు. పడకగదిలో నల్ల చీమలు ఉంటే కొత్త బంగారు ఆభరణాలు కొంటారని అర్థం.

Also Read : Wind Chime : అందం, ఆహ్లాదం, ఆనందం, అదృష్టం తో పాటు ఆరోగ్యాన్నిచ్చే విండ్ చైమ్. ఈ దిశలో ఉంచితే ఇవన్నీ మీ సొంతం

ఇంటి టెర్రస్ పైన నల్ల చీములు ఉత్తరం వైపు నుండి వస్తే జీవితంలో చక్కటి లాభాలు ఉంటాయని, దక్షిణ దిశ నుంచి చీమలు వస్తే ధన లాభం కలుగుతుందని, తూర్పు దిక్కున నుండి చీమల వస్తే అదృష్టానికి సంకేతం అని చెబుతున్నారు. ఇంట్లో నల్ల చీమలు ఉన్నట్లయితే అదృష్టం ఏదో ఒక రూపంలో రావచ్చని కూడా వాస్తు నిపుణులు (Vaastu Experts) అంటున్నారు.

ఎర్ర చీమలు :

Vaastu Tips : Any color of ants entering the house brings good luck. What does Vastu Shastra say?
Image Credit : trust Terminix

ఎర్ర చీమలు (Red ants) ఇంట్లోకి వస్తే మాత్రం అంత మంచిది కాదు. ఎందుకనగా ఎర్ర చీమలు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఎర్ర చీమల ఇంట్లో ఎక్కువగా ఉంటే ధన నష్టం, ప్రతికూల పరిస్థితులు, కష్టాలను కలిగిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎర్ర చీమల ఇంట్లో ఉంటే మాత్రం వాటిని చీమల మందుతో చంపేయాలి.

Also Read : Vaastu Tips : ప్రశాంత జీవితం కొనసాగాలంటే ఇంటిలో ఈ నియమాలను పాటించండి.

నల్ల చీమలు ఇంట్లోకి వస్తే వాటికి ఏదైనా తీపి పదార్థాన్ని ఆహారంగా పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా శుభ ఫలితాలను (Good results) పొందే అవకాశం ఉంటుంది.

కాబట్టి నల్ల చీమలు ఇంట్లోకి వస్తే శుభ సూచకంగా భావించాలి. వాస్తు శాస్త్రం మీద నమ్మకం (trust) ఉన్నవారు పాటించండి. శుభ ఫలితాలను పొందండి. మరియు ఆనందంగా జీవించండి.

Comments are closed.