2024 Jeep Wrangler Facelift, Powerful SUV: కొత్త జీప్ రాంగ్లర్ ఎందుకు అన్ని SUV ల కన్నా పవర్-ఫుల్?

2024 జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ వచ్చేసింది, అయితే దాని ఐకానిక్ డిజైన్ పెద్దగా మారలేదు. అయినప్పటికీ, అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లు మరియు మెరుగుదలలు ఉన్నాయి, ఇవి ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు చక్కని ఎంపికగా చెప్పుకోవచ్చు.

2024 Jeep Wrangler: 2024 జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్‌ మార్కెట్ లోకి విడుదల అయింది, అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లను పరిచయం చేస్తూ దాని ఐకానిక్ డిజైన్‌ను మెరుగుపరుస్తుంది. హై వాటర్ వాడింగ్(water wading) కెపాసిటీ మరియు యాంటీ-రోల్ బార్ డిస్‌కనెక్ట్ సిస్టమ్‌తో సహా మెరుగైన ఆఫ్-రోడ్ కెపాసిటీతో, రాంగ్లర్ కఠినమైన కొండలు మరియు కష్టమైన రోడ్స్ మీద డ్రైవ్ చేయడానికి సిద్ధంగా ఉంది. పెద్ద గ్రిల్ మరియు కొత్త యాంటెన్నా డిజైన్ వంటి అప్‌డేట్‌ల వలన దాని లుక్ ని ఇంకా పెంచుతున్నాయి. లోపల, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు పవర్డ్ సీట్స్ మంచి కంఫర్ట్ ని ఇస్తాయి. మొత్తంమీద, 2024 రాంగ్లర్ ఆఫ్-రోడ్ పెర్ఫార్మన్స్ మరియు లేటెస్ట్ ఫీచర్ల యొక్క అద్భుతమైన ప్యాకేజ్ అందిస్తుంది.

2024 Jeep Wrangler Off-Road Capabilities

Water Wading Capacity: కొత్త రాంగ్లర్ 864 మిమీ వాటర్ వాడింగ్ కెపాసిటీ కలిగి ఉంది, ఇది మునుపటి వెర్షన్ కంటే 100 మిమీ ఎక్కువ. వివిధ నీటి మట్టాలు మరియు బలమైన ప్రవాహాలతో నదుల గుండా ప్రయాణించేటప్పుడు ఈ కెపాసిటీ పెరగడం వాళ్ళ చాల ప్రయోజనకరంగా ఉంటుంది.

Anti-Roll Bar Disconnect: రాంగ్లర్ యాంటీ-రోల్ బార్ డిస్‌కనెక్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంది, ఇది వీల్స్ యొక్క పెర్ఫార్మన్స్ మరియు రోడ్ పై ట్రాక్షన్‌ను పెంచుతుంది. ఈ సిస్టం ఆఫ్-రోడ్ పెర్ఫార్మన్స్ ని మెరుగుపరుస్తుంది, ముఖ్యంగా రాతి ఉపరితలాలపై.

Ground Clearance: రూబికాన్ ట్రిమ్‌పై 237 మిమీ మరియు అన్‌లిమిటెడ్ ట్రిమ్‌పై 223 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో, రాంగ్లర్ ఆఫ్-రోడ్ వివిధ కష్టమైన కొండలని అధిగమించడానికి అద్భుతమైన క్లియరెన్స్‌ను అందిస్తుంది.

Gradability: రాంగ్లర్ గరిష్టంగా 36° వంపుతో, నిటారుగా ఉన్న కొండలను అధిరోహించడంలో రాణిస్తుంది. ఈ క్యాపబిలిటి 4×4 సిస్టమ్, లాక్ చేయగల డిఫరెన్షియల్‌లు మరియు క్రాల్ రేషియో ద్వారా మరింత మెరుగుపరచబడింది, ఇది కఠినమైన టెర్రాయిన్ హ్యాండిల్ చేయడం సులభం చేస్తుంది.

Exterior Updates

Grille: 2024 Jeep Wrangler ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు పెద్దదిగా మరియు బ్లాక్ కలర్ లో ఉంది, 2024 రాంగ్లర్‌ దాని ఓల్డ్ మోడల్ తో పొలిస్తే కొన్ని ఎక్కువ ఫీచర్స్ తో వస్తుంది. ఇది కెమెరా తో కూడా వస్తుంది, ఇది ఆఫ్-రోడ్ విన్యాసాలలో సహాయపడుతుంది మరియు కొత్త డ్యాష్‌బోర్డ్ ఫీచర్ల సూట్‌ తో వస్తుంది.

Antenna: ట్రేడిషనల్ ఎక్సటర్నల్ యాంటెన్నా ప్లేస్ లో గొరిల్లా గ్లాస్ విండ్‌షీల్డ్‌పై ప్రింట్ చేసిన యాంటెన్నా వస్తుంది. ఈ మార్పు ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ల సమయంలో యాంటెన్నా కొమ్మలపై చిక్కుకునే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Body Colors and Alloys: 2024 రాంగ్లర్ కొత్త బాడీ కలర్స్ మరియు అల్లాయ్ వీల్ డిజైన్‌లను అందిస్తుంది, దాని డిజైన్ ని ఇంకా మెరుగుపరుస్తుంది. రూబికాన్ ట్రిమ్ 17-ఇంచ్ మడ్ టెర్రైన్ టైర్‌లతో వస్తుంది, అయితే అన్‌లిమిటెడ్ ట్రిమ్‌లో 18-ఇంచ్ హైవే టెర్రైన్ టైర్‌లు ఉన్నాయి.

Interior Upgrades

Infotainment System: కొత్త 12.3-ఇంచ్ ల్యాండ్ స్కేప్ -ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ డ్యాష్‌బోర్డ్‌లో ఇంటిగ్రేట్ చేయబడింది, ఇది స్పష్టమైన మరియు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది. సిస్టమ్ మొత్తం డ్రైవింగ్ ఫీల్ మెరుగుపరిచే ఆఫ్-రోడ్ ఉపయోగం కోసం
డిజైన్ చేయబడింది.

Seat Comfort: సీట్లు ఇప్పుడు పవర్‌తో వస్తున్నాయి మరియు మోటార్‌లు మరియు స్విచ్‌లు వాటర్‌ప్రూఫ్‌గా ఉంటాయి, ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌ల తర్వాత సులభంగా క్లీన్ మరియు మెయింటేన్ చేయవచ్చు.

Safety: స్టాండర్డ్ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ సేఫ్టీ ని మెరుగుపరుస్తాయి, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు అదనపు ప్రొటెక్షన్ అందిస్తాయి.

On-Road Experience

Ride Comfort: రాంగ్లర్ ఆఫ్-రోడ్ పెర్ఫార్మన్స్ బాగా ఉన్నపటికీ , దాని ఆన్-రోడ్ పెర్ఫార్మన్స్ నార్మల్ గానే ఉంది. రెమోవబుల్
హాఫ్-టాప్ డిజైన్ వల్ల సరిగ్గా ఇన్సులేషన్ రాలేదు, ఫలితంగా క్యాబిన్ లోపల రోడ్ మరియు టైర్ సౌండ్ పెరుగుతుంది.

Powertrain: రాంగ్లర్ దాని 2.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 270 హార్స్‌పవర్ మరియు 400 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ రెండింటికీ తగిన ప్రతిస్పందించే పెర్ఫార్మన్స్ అందిస్తుంది.

2024 Jeep Wrangler overall review 
2024 జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ అనేక అర్థవంతమైన మెరుగుదలలను తీసుకువస్తుంది, ఇది ఆఫ్-రోడ్ ఔత్సాహికులకు చక్కని ఎంపిక. మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలు, నవీకరించబడిన ఫీచర్లు మరియు మెరుగైన సౌలభ్యం మరియు భద్రతతో, రాంగ్లర్ ఐకానిక్ మరియు సామర్థ్యం గల ఆఫ్-రోడర్‌గా చెప్పుకోవచ్చు.

2024 Jeep Wrangler Specifications

Feature Specification
Water Wading Capacity 864 mm
Ground Clearance (Rubicon) 237 mm
Ground Clearance (Unlimited) 223 mm
Engine 2.0L Direct Injection Turbocharged Petrol
Horsepower 270 hp
Torque 400 Nm
Transmission 8-Speed Automatic
Off-Road Features Anti-Roll Bar Disconnect, 4×4 System, Lockable Differentials
Infotainment System 12.3-inch Landscape-Oriented Touchscreen
Safety 6 Airbags
Seating Capacity 4-5
Tire Size (Rubicon) 17-inch Mud Terrain
Tire Size (Unlimited) 18-inch Highway Terrain
Colors Available Various

 

2024 Jeep Wrangler

Comments are closed.