అశోక్ లేలాండ్ కొత్త ఎలక్ట్రిక్ బస్సు, ఇ-బస్సు యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ మీ కోసం

కంపెనీ ఇ-బస్సు ని స్కూల్స్ కి, కంపెనీస్ కి, టూర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కమర్షియల్ గా ఉపయోయించవచ్చు అని చెప్తుంది. కంపెనీ ఇంకా దీని ధర మరియు మార్కెట్ లోకి రిలీజ్ చేసే డేట్ ని ప్రకటించలేదు.

Telugu Mirror : వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ సంస్థ అయినా అశోక్ లేలాండ్  తమ కొత్త ఎలక్ట్రిక్ బస్సు ని 2024 భారత్ మొబిలిటీ షో లో ప్రదర్శించింది. ఇందులో హైడ్రోజన్ టెక్నాలజీ ఉపయోగించినట్టు కంపెనీ తెలిపింది, అంటే హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మార్చడానికి ఇంధన కణాలను ఉపయోగిస్తాయి, విద్యుత్ మోటారుకు శక్తినిస్తాయి. కంపెనీ ఇ-బస్సు ని స్కూల్స్ కి, కంపెనీస్ కి, టూర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కమర్షియల్ గా ఉపయోయించవచ్చు అని చెప్తుంది. కంపెనీ ఇంకా దీని ధర మరియు మార్కెట్ లోకి రిలీజ్ చేసే డేట్ ని ప్రకటించలేదు.

2:2 సీట్స్ తో వస్తున్న ఇ- బస్సు ఎన్నో కొత్త ఫీచర్స్ తో ప్యాసెంజర్స్ ని ఆకట్టుకోబోతుంది అని కంపెనీ తెలుపుతుంది. ఇందులో ఏసీతో పాటు  ప్యాన్స్ కూడా వస్తున్నాయి, విశాలమైన లెగ్ స్పేస్ తో పాటు కంఫర్ట్ ఇచ్చే సీట్స్, రిక్లినర్ సీట్స్, ఛార్జింగ్ సాకెట్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫ్రంట్ అండ్ రేర్ ఎల్ఈడీ లాంప్స్ తో పాటు భారీ స్టోరేజ్ స్పేస్ తో కలిగి వస్తుంది.

ashok-leyland-new-electric-bus-e-bus-features-and-specifications-for-you

Also Read : Brahmamudi Serial Feb 5th Episode : కొత్త లుక్ లో కావ్య అదుర్స్ – రాజ్ ఫ్లాట్.. శ్వేతపై కోపంగా ఉన్న కావ్య

కంపెనీ ఈ కొత్త హైడ్రోజన్ టెక్నాలజీ తో 250km రేంజ్ వరకు వస్తుంది అని తెలిపింది. అదే విధంగా సేఫ్టీ పరంగా ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ ఆన్ ట్యాంక్- మౌంటెడ్ వాల్వ్స్, ఎలక్ట్రానిక్ వాల్వ్స్, హైడ్రోజన్ లీక్ డిటెక్షన్ సెన్సార్లు, ఇలా ఎన్నో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.

స్పెసిఫికేషన్స్ : 

  • ఫ్యూయల్ సెల్ పవర్ : 80kw
  • మోటార్ పవర్ : 120kw
  • మోటార్ టార్క్యూ : 409Nm
  • hv బ్యాటరీ : 71 Kwh
  • బ్రేక్స్ : ABS బ్రేక్స్

హైడ్రోజన్ ట్యాంక్స్

  • ట్యాంక్ టైపు : టైపు 4
  • ప్రెషర్ : 350bar
  • ట్యాంకుల సంఖ్య : 3
  • సస్పెన్షన్ : 4 ఎయిర్ సస్పెన్షన్

Comments are closed.