CSIR-CMERI అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ CSIR PRIMA ET11

CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రాబోయే కొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి చేయబడుతుంది. ఈ ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చాక రైతులకు బోలెడన్ని లాభాలు పొందుతారు.

Telugu Mirror : రైతుల పని మరింత సులువుగా మారేందుకు మరియు వారు పడే కష్టాన్ని కొంత మేరకు తగ్గించేందుకు ఆధునిక పరికరాలను ఉపయోగిస్తుంటారు.ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రతిఫలంగా CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ మార్కెట్‌లోకి విడుదల కానుంది. రైతులు కూడా వారి పొలంలో వ్యవసాయం చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరికరాలను కలిగి ఉండాలని కోరుకుంటారు. పని తొందరగా పూర్తి కావాలంటే లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన పరికరాలను ఉపయోగించడం మంచిది. మార్కెట్‌కి రానున్న ఈ ట్రాక్టర్ కి సంబంధించిన దాని గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : Nipah Vairus : కేరళను వణికిస్తున్న నిపా వైరస్, పలు ప్రాంతాలలో ఆంక్షలు

ఇతర దేశాల్లో ఆధునిక టెక్నాలజీతో ట్రాక్టర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే, మొట్టమొదటి సారిగా మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ బ్యానర్‌తో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి భారతీయ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను తయారు చేసింది. CSIR PRIMA ET 11 అనేది పొలంలో అనేక రకాల పనులను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. CSIR PRIMA ET 11 అని పిలువబడే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రెండు కంపెనీల సహకారంతో అభివృద్ధి చేయబడింది.

CSIR PRIMA ET11 is a compact electric tractor developed by CSIR-CMERI
Image Credit : IndianTimes

డీజిల్ తో నడిచే ట్రాక్టర్‌తో పోలిస్తే, CSIR PRIMA ET 11 అతి తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ ట్రాక్టర్ చూడడానికి చిన్న పరిమాణం లో ఉంటుంది కానీ దీని వల్ల చాలా పనులు చేసుకోవచ్చు. దీన్ని ఏడెనిమిది గంటల పాటు ఛార్జ్ చేయడం ముఖ్యం. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే నాలుగు గంటలపాటు ఇది పని చేస్తుంది. CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని కలిగి , అద్భుతమైన మైలేజ్ ని ఇస్తుంది. CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ యొక్క భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది తయారు చేసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అదనంగా, కవర్ మరియు గాడ్ వికార్ కి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోబడ్డాయి. ముఖ్యంగా, ఇటువంటి ట్రాక్టర్లు ఎక్కువ కాలం పని చేస్తాయి.

Also Read : జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా,అయితే ఈ చిట్కాలు పాటించండి

రిపేర్ సమస్యలు తొందరగా రావు. పూర్తిగా ఛార్జ్ చేయడానికి, CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌కు 3000 వాట్స్ పవర్ ఇన్‌పుట్ అవసరం అవుతుంది. CSIR PRIMA ET 11 ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ధర రాబోయే కొద్ది రోజుల్లో అధికారికంగా వెల్లడి చేయబడుతుంది. ఈ CSIR PRIMA ET 11 ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చాక రైతులకు బోలెడన్ని లాభాలు పొందుతారు.

Comments are closed.