Skycar: సుజుకి నుంచి ఎగిరే కార్ (eVTOL).

సుజుకి బైక్‌లు, ఆటోమొబైల్స్ మరియు మెరైన్ ఇంజన్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. వీలు 2022 లో స్కైడ్రైవ్ కంపెనీ తో కలిసి ఎగిరే కారు మీద రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేసారు.

Telugu Mirror: సుజుకి మరియు స్కైడ్రైవ్ కలిసి ‘స్కైకార్’ (Skycar) ను త్వరలో మన ముందుకి తీస్కొని రాబోతున్నాయి, ఇది పట్టణ రవాణాను మార్చడానికి రూపొందించబడిన ఒక మార్గదర్శక ఎగిరే కారు.

సుజుకి బైక్‌లు, ఆటోమొబైల్స్ మరియు మెరైన్ ఇంజన్‌ల తయారీకి ప్రసిద్ధి చెందింది. వీళ్ళు 2022 లో స్కైడ్రైవ్ కంపెనీ తో కలిసి ఎగిరే కారు మీద రీసెర్చ్ చేయటం స్టార్ట్ చేసారు. దానికి eVTOL అని పేరు పెట్టారు. అంటే (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) విమానం.

ఈ మధ్య జరిగిన భారత మొబిలిటీ ఎక్స్పో (Mobility Expo) లో దీన్ని ప్రదర్శించారు. ఈ వాహనం ఇంకా నిర్మాణంలో ఉందని  మరియు 2026లో జపాన్ ఆకాశాన్ని తాకుతుందని కంపెనీ తెలిపింది. ఇది ముగ్గురు ప్రయాణీకులను తీసుకెళ్లగలదు, విద్యుత్తుతో నడుస్తుంది మరియు 1400 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ప్రోటోటైప్ ఇప్పటికే 15 కి.మీ పరిధిని సాధించింది, ఇది భారతదేశానికి కూడా వస్తుందని కంపెనీ తెలిపింది.

Suzuki Sky Car
image credit : asahi.com

Also Read : అశోక్ లేలాండ్ కొత్త ఎలక్ట్రిక్ బస్సు, ఇ-బస్సు యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ మీ కోసం

Seating Capacity 3(1 pilot and 2 passengers)
Power Supply Battery Electric
Main Structural Materials Composite, Aluminum alloy, etc
Maximum Take off Wright Approximately 1,400 Kg (3,100 lbs.)
Maximum Cruise Speed 100 Km/h (K/AS)(air speed)
Range Approximately 15km (9 miles)
dimesions(L X W W H) : Approx 11.3m x 11.3m x 3m( 37.7 ft x 37 x10 ft) including motors

వ్యాపారం మరియు సాంకేతికత ప్రాజెక్ట్‌లపై సుజుకి స్కైడ్రైవ్‌తో భాగస్వామి అవుతుంది. పత్రికా ప్రకటన ప్రకారం, సహకారం “సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి, తయారీ మరియు భారీ-ఉత్పత్తి వ్యవస్థల ప్రణాళిక, భారతదేశంపై ప్రాథమిక దృష్టితో విదేశీ మార్కెట్ల అభివృద్ధి మరియు కార్బన్ న్యూట్రాలిటీని సాధించే ప్రయత్నాలను ప్రోత్సహించడం”పై దృష్టి పెడుతుంది అని కంపెనీ తెలిపింది.

2025లో జరిగే ఒసాకా గ్లోబల్ ఎక్స్‌పో సందర్భంగా ఈ వాహనాన్ని ఎయిర్ టాక్సీ సర్వీస్‌గా ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అన్ని అనుకూలిస్తే 2025 నాటికి మనం ఎగిరే కార్ లని ఆకాశం లో చక్కర్లు కొట్టడం చూస్తాం అని కంపెనీ వెల్లడించింది.

Comments are closed.