మైలేజ్ కోసం మస్తు కష్టాల, అయితే ఈ మూడు బైకులుపై ఓ లుక్కెయ్యండి…

తక్కువ ధర తో ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్స్ కొనాలని ఆశ పడుతున్నట్లు అయితే ఒకసారి ఈ బైక్స్ పై ఓ లుక్కేయండి.

Telugu Mirror : ఈరోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆధునికత అభివృద్ధి చెందడం తో కొత్త కొత్త వాహనాలు అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. అయితే బైక్‌లకు మైలేజీ తక్కువగా ఉండడంతో ట్యాంక్ ని ఇంధనం తో ఫుల్ చేసిన కూడా కొద్ది మాత్రమే దూరం ప్రయాణించగానే ఇంధనం సగానికి తగ్గిపోతుంది. ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్ అవసరం.

అయితే, ఎక్కువ మైలేజ్ వచ్చే బైక్స్ కోసం మీరు వెతుకుతున్నట్లయితే,మంచి ఫీచర్స్ తో కూడిన కొన్ని బైక్ ల గురించి మీకు చెప్పబోతున్నాం. అయితే, ఇక్కడ ఒక బైక్ కేవలం ఒక్క రూపాయితో ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు మరియు ధర విషయానికి వస్తే అవి చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఒక నెల జీతంతో, మీరు ఈ బైక్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

Also Read : మీ వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ ఉందా, లేకపోతే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

TVS స్పోర్ట్స్

Looking for high mileage bikes? But, take a look at these 3 bikes
Image credit : TVS Motor

TVS నుండి వచ్చే స్పోర్ట్స్ బైక్ లీటరుకు 70 కి.మీల శక్తివంతమైన మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ చాలా కాలంగా భారతీయ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు రైడర్‌లలో అగ్రస్థానంలో ఉంది. 8.18 bhp మరియు 8.7 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తూ 109.7cc BS6 ఇంజన్ ని కలిగి ఉంది. అదనంగా, ప్రతి టైర్ల పై డ్రమ్ బ్రేక్‌లు అందించబడతాయి. ఈ బైక్ సేఫ్టీ పరంగా చూస్తే అద్భుతమైనదని చెప్పవచ్చు. ఇక ధర విషయానికి ఇది కేవలం రూ. 61,602కే అందుబాటులో ఉంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఈ బైక్ కొనేయొచ్చు.

బజాజ్ ప్లాటినా 100

Looking for high mileage bikes? But, take a look at these 3 bikes
Image credit : Bikewale

లీటరుకు 90 కిమీ వేగంతో దూసుకెళ్లే ఈ బైక్ అద్భుతమైన ఫీచర్స్ ని కలిగి ఉంది. వాస్తవానికి, ఎక్కువ ప్రజాదరణ పొందిన ఈ బజాజ్ బైక్ లీటరుకు 75 మరియు 90 కిమీల మధ్య అసాధారణ మైలేజీని అందిస్తుంది. 102cc ఇంజన్‌లోని DTS-i టెక్నాలజీ దీనికి శక్తివంతమైన 7.9hp మరియు 8.3Nm టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. దీని ధర రూ.67,475 (ఎక్స్-షోరూమ్).

చంద్రుని పైకి జపాన్ ప్రయోగించిన SLIM విజయవంతం

హీరో HF డీలక్స్

Looking for high mileage bikes? But, take a look at these 3 bikes
Image credit : 91 wheels

ఈ హీరో వాహనం లీటరుకు 65 కి.మీ మైలేజ్ ని ఇస్తుంది.సేఫ్టీ పరంగా చూస్తే ఈ బైక్ కి రెండు టైర్స్ కి డ్రమ్ బ్రేక్‌లు ఉపయోగించబడతాయి మరియు ఇంజిన్ యొక్క 97.2cc, BS6 ఇంజిన్ 7.91 bhp మరియు 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ రూ.56,185 ధరతో అందుబాటులో ఉంది. ఇంకా కంపెనీ 5 వెర్షన్లు మరియు 10 రంగు ఎంపికలలో విక్రయించనుంది. ఈ అద్భుతమైన కొనుగోలు చేసుకోండి.

Leave A Reply

Your email address will not be published.