Women Loan Scheme : మహిళల కోసం అద్భుత రుణ పథకం..దళిత మహిళ లకు వడ్డీ లేకుండా రుణం

Telugu Mirror : ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అడుగు పెట్టని రంగం లేదు,ఆకాశం నుంచి అవని వరకు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు. అయితే అందరికీ అన్ని చోట్లా అవకాశాలు రావు. కొంత మంది మహిళలకు వారు ఎంతటి ప్రతిభావంతులైనా వారి ఆర్ధిక పరిస్థితి కారణంగా వారు ఎంచుకున్న వ్యాపారంలో ముందుకు వెళ్ళలేరు. మహిళలకు అండగా ఉండి వారికి ఆర్ధిక స్వావలంబన కలిపించి వారిని ఆర్ధికంగా అభివృద్ది పరిచేందుకై కేంద్ర ప్రభుత్వంచే రూపొండించబడిన పథకం ఉద్యోగిని.కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ కార్యక్రమ లక్ష్యాలలో ఈ పధకం కూడా ఒక్కటి.మహిళలకు ఆర్ధిక స్వావలంబన కోసం ఆర్ధికంగా సహాయం అందించడమే ఈ ‘ఉద్యోగిని’ పథకం.

TeamIndia Captain : టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ సమర్ధుడే.. కానీ సాధ్యమవుతుందా?

మహిళలకు పారిశ్రామిక,వ్యాపార రంగాలలో ఆర్ధిక తోడ్పాటును ఇచ్చి వారు తమ కాళ్ళపై తాము నిలబడేందుకు ప్రవేశ పెట్టిన పథకమే ఉద్యోగిని.
ఉద్యోగిని పథకం మొదట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ పథకం సత్ఫలితాలను ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశమంతటా అమలు పరుస్తుంది.ముఖ్యంగా ఈ పధకం గ్రామీణ ప్రాంతాలలోని మహిళల ఆర్ధిక పురోగతికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం ఈ పథకం కింద 48 వేల మంది మహిళలు లబ్దిపొంది చిన్నపాటి పారిశ్రామిక వేత్తలు గా ఎదిగారు.
ఉద్యోగిని పధకం రుణ పరిమితి?

ఈ పథకం క్రింద 3 లక్షల వరకు రుణం ఇస్తారు.కానీ వితంతువులకు,అంగ వైకల్యం కలిగిన మహిళలకు మాత్రం రుణ పరిమితి లేదు.వారు ఎంచుకున్న వ్యాపారం,వారికి ఉన్న అర్హతలను బట్టి ఇంకా ఎక్కువ రుణం అందిస్తారు.రుణం పై వడ్డీ?ఉద్యోగిని పధకం క్రింద తీసుకున్న రుణానికి వైకల్యం కలిగిన మహిళలకు,వితంతువులకు,దళిత మహిళలకు పూర్తిగా వడ్డీ లేని రుణం ఇస్తారు. ఇతర వర్గాలకు చెందిన మహిళలకు 10 శాతం నుండి 12 శాతం వడ్డీ పై రుణాన్ని కల్పిస్తారు.వడ్డీ మహిళలు రుణం తీసుకునే బ్యాంక్ నిభంధనల ప్రకారంగా ఉంటుంది.కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి తీసుకున్న రుణం లో 30 శాతం వరకూ రాయితీ కల్పిస్తారు.

Crocodile : చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం ప్రత్యక్షం..

ఉద్యోగిని పథకానికి అర్హతలు :

  • ఈ పథకం 18 సంవత్సరాల వయస్సు నిండి 55 సంవత్సరాల వయసు లోపు ఉన్న మహిళలు అందరూ అర్హులు.
  • గతంలో ఏదైనా బ్యాంక్ లో రుణం తీసుకుని సరిగ్గా చెల్లించని మహిళలకు రుణం ఇవ్వరు.
  • సిబిల్ స్కోర్ మెరుగుగా ఉండాలి,క్రెడిట్ స్కోర్ ని సరిగా ఉండాలి.

ఉద్యోగిని పథకానికి కావలసిన పత్రాలు:

  • దరఖాస్తు పూర్తి చేసి దానికి రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు జోడించాలి.
  • దరఖాస్తు చేసుకున్న మహిళ ఆధార్ కార్డ్ మరియు జనన ధృవీకరణ సర్టిఫికెట్.
  • తెల్ల రేషన్ కార్డ్
  • ఆదాయధృవీకరణ సర్టిఫికెట్
  • రెసిడెన్స్ సర్టిఫికెట్
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  • బ్యాంక్ పాస్ బుక్

పై పత్రాలతో ఈ పథకం కింద రుణం తీసుకోవాలి అనుకున్న మహిళలు తమ ప్రాంతంలోని బ్యాక్ లను సంప్రదించాలి.బజాజ్ ఫైనాన్స్ లాంటి ప్రైవేట్ ఆర్ధిక సంస్థలు కూడా ఉద్యోగిని పధకం క్రింద రుణ సదుపాయం కల్పిస్తున్నాయి.ఈ రుణం గురించి ఇంకా వివరాలు తెలుసు కోవాలి అనుకుంటే ఈ చిరునామా లో సంప్రదించండి.

ఉద్యోగిని, D-17,Basement ,Saket, New Delhi – 110017.
ఫోన్ నంబర్ : 011- 45781125
ఈ మెయిల్ : mail@udyogini.org

Leave A Reply

Your email address will not be published.