Nippon India Small Cap Fund: నెలకి 10వేల పెట్టుబడితో.. లక్షాధికారి అవడం ఎలా? నిప్పాన్ ఇండియా లో SIP చేయండిలా

Telugu Mirror: మ్యూచువల్ ఫండ్ (MF) పెట్టుబడిదారులకు స్మాల్ – క్యాప్ మ్యూచువల్ ఫండ్ లు ఇస్టమైనవిగా మారినాయి.కారణం ఏమిటి అంటే స్మాల్ క్యాప్ MF లలో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్ లను అందజేస్తున్నాయి. స్మాల్ క్యాప్‌ ఫండ్ లు చాలా రిస్క్ కలిగినవిగా లెక్కించబడుతున్నప్పటికీ , హర్షద్ మెహతా స్కాం(Harshad Mehta scam) ఆధారంగా వచ్చిన వెబ్ సిరీస్ ‘స్కామ్ 1992’ లో చెప్పిన ‘రిస్క్ హై తో ఇష్క్ హై’ ఆధారంగా ఈ మార్గం లో ఉన్న లాభాలను పొందాలంటే మన జీవితంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం పక్కాగా ఉందని గుర్తుచేస్తుంది. అయితే ఇప్పుడు తెలుసుకునే స్మాల్ క్యాప్ ఫండ్ వచ్చేసి, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ – రెగ్యులర్ ప్లాన్(Nippon India Small Cap Fund – Regular Plan). ఇది స్మాల్-క్యాప్ మ్యూచువల్ ఫండ్ ప్లాన్, ఈ స్మాల్ క్యాప్ ఫండ్ అద్భుతమైన ఆదాయాన్ని కలిగించింది మరియు దానిలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు అద్భుతమైన డబ్బును పెంచింది.

మీరు తీసుకునే ఇన్వెష్ట్ మెంట్ నిర్ణయం ఈ రాబడి పై ప్రభావంతో ఉండకూడదు. ఎందుకంటే గత పనితీరు పునరావృతం అవుతుందనే నమ్మకం లేదు.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ – రెగ్యులర్ ప్లాన్

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ – రెగ్యులర్ ప్లాన్ అనేది నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ నుండి వచ్చిన స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనేది సిస్టమాటిక్ ఇన్వెష్ట్ మెంట్ ప్లాన్ (SIP) చివరి మూడు మరియు ఆరు నెలలలో కంటిన్యూ గా 19.05% మరియు 26.20% ఆదాయాన్ని ఇచ్చింది. వ్యాల్యూ రీసెర్చ్ లో లభ్యమైన వివరాల ప్రకారం, ఈ స్మాల్ క్యాప్ ఫండ్ సంవత్సరంలో 33.93 శాతం, మూడేళ్లలో 44.84% అలాగే గత ఐదు, ఏడు మరియు పదేళ్లలో కంటిన్యూ గా 21.82%, 22.28% మరియు 29.62% రాబడిని ఇచ్చింది.16 సెప్టెంబర్ 2019న, ఈ ఫండ్ ప్రారంభించబడింది. ఈ పథకం NIFTY స్మాల్‌క్యాప్ 250 మొత్తం రాబడి యొక్క సూచిక స్థితిని ట్రేస్ చేస్తుంది. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ – రెగ్యులర్ ప్లాన్ ప్రారంభించి పదమూడు సంవత్సరాలు అవుతుంది. ఈ ప్లాన్ ని ప్రారంభించినప్పటి నుండి 20.89% రాబడిని ఇచ్చింది

Image credit: value research

Also Read: sbi నుంచి సామాన్యులకు సైతం అద్భుత పథకం..కొత్త స్కీమ్ అమలులోకి..

మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్(Mutual Fund Calculator)

మ్యూచువల్ ఫండ్ SIP కాలిక్యులేటర్ (అంటే పెట్టిన పెట్టుబడి కి వచ్చే రాబడిని లెక్కించేది) పదేళ్లలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్‌లో సాధారణ నెలవారీ రూ .10,000 SIP లో పెట్టుబడి పెడితే. ఇది పెట్టుబడి పెట్టిన వారిని లక్షాధికారులను చేస్తుంది. ఈ ఫండ్ పదేళ్లలో 25.96% ఇయర్లీ రాబడిని అందించింది. కాలిక్యులేటర్ లో చూపిన ప్రకారం ఈ ఫండ్ లో నెలవారీ SIP రమారమి

రూ.10,000 పెరగవచ్చని చూపిస్తుంది. పదేళ్లలో ఇది

రూ.57,53,702 అవుతుంది. మ్యూచువల్ ఫండ్ కాలిక్యులేటర్ పది సంవత్సరాలలో 1 లక్ష ఏక మొత్తం పెట్టుబడి ఐదు రెట్లు ఎక్కువ ఏ విధంగా పెరిగిందో తెలుపుతుంది.

పరిశ్రమ గణాంకాల ప్రకారం రిటైల్ పెట్టుబడి మ్యూచ్ వల్ ఫండ్ హోల్డింగ్స్ సంవత్సర ప్రాతిపదికన 20.5 శాతం పెరిగి ప్రస్తుతం సుమారుగా రూ.25 లక్షల కోట్లకు చేరువయ్యింది అని తెలిపాయి.

గమనిక: పెట్టుబడి పెట్టాలనే నిర్ణయాలు తీసుకునే ముందు, ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయం తీసుకుని మీ స్వీయ ఆలోచనల ప్రకారం నిర్ణయాలను తీసుకోగలరని Telugu Mirror నుండి సలహా ఇస్తున్నాము.

Leave A Reply

Your email address will not be published.