Beauty Tips : చలికాలంలో చర్మ సమస్యల నుంచి రక్షించే నేచురల్ ఫేస్ ప్యాక్.

శీతాకాలంలో అందరూ ఎదుర్కునే సమస్య చర్మం పొడిబారడం మరియు చర్మంపై ముడతలు రావడం.రసాయనాలు కలిగి ఉన్న క్రీములు లేదా ఫేషియల్స్ కన్నా ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడినట్లయితే చర్మానికి చాలా మేలు చేస్తాయి.ఇంటి చిట్కాలు చర్మాన్ని సంరక్షించడంలో చాలా బాగా పనిచేస్తాయి.

శీతాకాలంలో అందరూ ఎదుర్కునే సమస్య చర్మం పొడిబారడం (dryness) మరియు చర్మంపై ముడతలు రావడం. ఇటువంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ ఎక్కువగా బాధిస్తుంటాయి.

మార్కెట్లో లభించే రకరకాల క్రీములు మరియు ఖరీదైన ఫేషియల్ వీటిలో రసాయనాలు (Chemicals)  ఉంటాయి. ఇవి చర్మంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

కాబట్టి రసాయనాలు కలిగి ఉన్న క్రీములు లేదా ఫేషియల్స్ కన్నా ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన ఫేస్ ప్యాక్ లను వాడినట్లయితే చర్మానికి చాలా మేలు చేస్తాయి.

Also Read : Beauty Tip : ఆహారం లో ఈ పదార్ధాలను తీసుకోండి, సన్ స్క్రీన్ రాయకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.

వీటి వల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదు. ఇంటి చిట్కాలు చర్మాన్ని సంరక్షించడంలో చాలా బాగా పనిచేస్తాయి.

ఈరోజు కథనంలో చలికాలంలో ఎక్కువగా వచ్చే పొడిబారిన చర్మం మరియు ముడతలు రావడం. వీటిని తొలగించుకోవడం కోసం ఫేస్ ప్యాక్ లను తెలియజేస్తున్నాం. అవేమిటో చూద్దాం.

ఫేస్ ప్యాక్ కు కావలసిన పదార్థాలు:

ఒక టేబుల్ స్పూన్ – బియ్యప్పిండి (Rice Flour), ఒక స్పూన్- కాఫీ పౌడర్, ఒక స్పూన్ – పంచదార, కొద్దిగా కొబ్బరి నూనె. ఈ పదార్థాలన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

Beauty Tips : A natural face pack that protects against skin problems in winter.
Image Credit : Health Shots

దీనిని ముఖం మరియు మెడ (neck) పై అప్లై చేసి సున్నితంగా ఒక నిమిషం పాటు మర్దనా చేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత మరొక ఫేస్ ప్యాక్ ను కూడా ఉపయోగించాలి.

రెండవ ఫేస్ ప్యాక్ :

అన్నం వండి‌ వార్చిన తర్వాత వచ్చిన గంజి (starch) ని తీసుకొని దానిలో అలోవెరా (Aloe vera) జెల్, కాఫీ పౌడర్ మరియు గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ పై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని మరియు మెడని సాధారణ నీటితో కడగాలి. ఇలా చేయడం వలన చర్మం మృదువుగా మారుతుంది.

ఈ రెండు ప్యాక్ లను వరుసగా మూడు రోజుల చేస్తే చాలు. మంచి ఫలితం కనబడుతుంది. చలికాలంలో చర్మంపై వచ్చే పగుళ్లు (cracks) సమస్య తగ్గిపోతుంది. అంతే కాకుండా కళ్ళ క్రింద నల్లటి వలయాల (Dark circles) ను  కూడా తొలగిస్తాయి. ముఖంపై ఉన్న ముడతలు తగ్గిపోతాయి. ముఖ చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా ఉంటుంది.

Also Read : Beauty Tips : మొటిమలు, మచ్చలతో నలుగురిలో కలవలేక పోతున్నారా? అయితే ఇది మీకోసమే

ఫేస్ వాష్ చేసిన తర్వాత ఏదైనా తేలికపాటిమాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వలన చర్మం ఎక్కువ రోజులు మృదువుగా, పొడిబార కుండా ఉంటుంది.

కాబట్టి శీతాకాలంలో వచ్చే చర్మ సమస్యలు ముఖ్యంగా చర్మం పొడిబారడం మరియు ముడతలు (Wrinkles) రావడం వంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఫేస్ ప్యాక్ లను వాడినట్లయితే ఈ సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు.

Comments are closed.