Beauty Tips : ఎండవల్ల ముఖంపై ఏర్పడే టాన్ ను సింపుల్ గా ఇలా తొలగించండి, మెరిసే చర్మం స్వంతం చేసుకోండి

ప్రస్తుత రోజుల్లో చాలామంది చర్మం టాన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ కాలంలోనైనా టాన్ రావడం అనేది సాధారణం. టాన్ నుండి తమ చర్మాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తుల (products) ను వాడుతున్నప్పటికీ ఎండ ప్రభావం చర్మంపై కనిపిస్తుంటుంది. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సూర్యకాంతి (sunlight) వల్ల వచ్చే టాన్ ను తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో చాలామంది చర్మం టాన్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ కాలంలోనైనా టాన్ రావడం అనేది సాధారణం. టాన్ నుండి తమ చర్మాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తుల (products) ను వాడుతున్నప్పటికీ ఎండ ప్రభావం చర్మంపై కనిపిస్తుంటుంది. సూర్యరశ్మి కారణంగా చర్మం టాన్ అవ్వడంతో పాటు నిర్జీవంగా కూడా మారుతుంది.

అటువంటి పరిస్థితిలలో ప్రజలు టాన్ నుండి బయటపడటానికి రకరకాల చర్మ సంరక్షణ చికిత్సలు కూడాతీసుకుంటారు.

స్కిన్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి భయపడితే కొన్ని విషయాలను గుర్తు ఉంచుకొని చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే ఇంట్లోనే టాన్ సమస్య నుండి బయటపడవచ్చు. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే సూర్యకాంతి (sunlight) వల్ల వచ్చే టాన్ ను తొలగించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

చలికాలం లేదా ఎండాకాలం ఏ సీజన్ లో అయినా బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ ఉపయోగించాలి. అయితే సన్ స్క్రీన్ (Sun screen) కొనేటప్పుడు బలమైన సూర్యకాంతి కిరణాల నుండి చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఎస్ పి ఎఫ్ 50 ఉన్న సన్ స్క్రీన్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఇది మీ చర్మానికి రక్షణ కవచం లాగా పని చేస్తుంది.

తరచుగా టాన్ సమస్యతో ఇబ్బంది పడేవారు స్క్రబ్బింగ్ (scrubbing) చేయడం ద్వారా టాన్ తొలగించుకోవచ్చు అని అనుకుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. అధికంగా స్క్రబ్బింగ్ చేయడం వలన చర్మం దెబ్బతింటుంది.

Beauty Tips: Get rid of the sun tan on your face in a simple way and get a glowing skin
image credit : Asianet News Telugu

చర్మం యొక్క నిగారింపు (Maintenance) ను సంరక్షించడంలో విటమిన్ సి చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్ మరియు ఫేస్ సీరంలో విటమిన్ సి సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. వీటిని వాడడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది.

ఎండలోకి వెళ్లేటప్పుడు మేకప్ ఎక్కువగా వేసుకోకూడదు. లైట్ మేకప్ వేసుకోవాలి. ఎక్కువ మేకప్ వేసుకోవడం వల్ల ముఖంపై అనేక రకాల దుష్ప్రభావాలని (Side effects) కలిగించేలా చేస్తుంది.

Also Read : ఫేస్ వాష్ వాడడం వలన ముఖంపై చెడు ప్రభావం ఉంటుందా ? తెలుసుకోండిలా.

వాతావరణం (weather) ఎలా ఉన్నా ముఖాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అవసరం. ఈ విధంగా చేయకపోతే ముఖంపై మురికి, జిడ్డు పెరిగిపోతుంది. వేసవి కాలంలో చర్మానికి మాయిశ్చరైజర్ రాయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అలా చేయడం సరైనది కాదు. చర్మం మెరుస్తూ ఉండాలని అనుకుంటే సన్ స్క్రీన్ అప్లై చేసిన కొంత సమయం తర్వాత చర్మంపై మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

Also Read : Tips for skin and health protection:వర్షాకాలంలో ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మ సంరక్షణకు రహస్య చిట్కాలు ఇప్పుడు మీ కోసం

కాబట్టి ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఎండ వల్ల చర్మంపై వచ్చే టాన్ నుండి బయట పడవచ్చు. మెరిసే చర్మంను పొందవచ్చు.

Comments are closed.