Unwanted Hair : అవాంఛిత రోమాలు మీ ముఖ సౌందర్యాన్ని చెడగొడుతుందా ? అయితే ఈ టిప్స్ మీ కోసం..

Telugu Mirror : స్త్రీలు అందంగా మరియు చర్మం కాంతివంతంగా చేయడానికి వివిధ రకాల బ్యూటీ టిప్స్(Beauty Tips) వాడుతుంటారు. అయితే మహిళల ఫేస్ పైన అవాంచిత రోమాలు(Unwanted Hair) చాలామందికి ఉంటాయి. కొంతమంది మహిళలకు పై పెదవి పైన వెంట్రుకలు ఎక్కువగా వస్తాయి మరి కొంతమందికి చిన్నవిగానే ఉంటాయి.మరి కొంతమందికి మాత్రం చాలా పొడవుగా ఉండి మగవాళ్లకు కనిపించినట్లుగా ఉంటాయి. వారు వాటిని వదిలించుకోవడం కోసం ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అయితే ట్రీట్మెంట్(Treatment) కోసం డబ్బులు ఖర్చు అవుతాయి..అందరూ ఆ ఖర్చు పెట్టలేరు, మరి కొంతమందికి వీలు కాకపోవచ్చు.

RBI : స్టార్ గుర్తు ఉన్న రూ. 500 నోట్లు నకిలీనా ? కాదా? RBI నుండి క్లారిటీ..

మరి కొంతమంది పై పెదవి మీద ఉండే అవాంచిత రోమాలు(Unwanted Hair) తీసివేయడానికి పార్లర్ కి వెళతారు. పార్లర్ లో త్రెడ్డింగ్ , బ్లీచ్, వ్యాక్సింగ్ ,హెయిర్ రిమూవల్ క్రీమ్ ఇలా వివిధ రకాల పద్ధతులను వాడతారు. ఇది పర్మినెంట్ సొల్యూషన్ కాదు. మళ్ళీ కొన్ని రోజులకు రావడం జరుగుతూనే ఉంటుంది.కొంతమంది స్త్రీలకు బిజీగా ఉండటం వల్ల పార్లర్ కు వెళ్లే తీరిక కూడా ఉండదు. అటువంటి సందర్భంలో మీరు ఇంట్లోనే కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా పైపెదవి పై ఉన్న అన్వాంటెడ్ హెయిర్ ను ఈజీగా తొలగించుకోవచ్చు.

హోమ్ రెమెడీస్ చూద్దాం:

Image Credit : News Track

బంగాళదుంప:

బంగాళదుంప(Potato) తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ ను శుభ్రంగా ఉన్న కాటన్ వస్త్రంలో వేసి వడకట్టండి. దీనిలో నుంచి రసం వస్తుంది. ఈ రసాన్ని రాత్రి నిద్రపోయే ముందు రాసి(Apply) అలాగే ఉంచాలి తర్వాత రోజు ఉదయాన్నే ముఖం సాధారణ నీటితో కడగాలి. ఈ పద్ధతిని సుమారుగా మూడు రోజులు చేయండి.

గోధుమపిండి:

అన్ వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి(Wheat Floor)లో, ఒక టీ స్పూన్ పచ్చిపాలు(Raw Milk) మరియు ఆర్గానిక్ పసుపు చిటికెడు వేసి పేస్ట్ లా చేయండి. దీనిని అన్వాంటెడ్ హెయిర్ ఉన్న దగ్గర రాయండి. ఆరిన తర్వాత నీటితో కడగండి. ఈ పద్ధతిని వారంలో మూడు నుంచి నాలుగు సార్లు చేయండి.

Bengal Couple : ఆశలు మేడలు కడుతున్నాయి..విలువలు రోడ్డున పడుతున్నాయి..పసిబిడ్డను అమ్మి iphone కొన్న తల్లిదండ్రులు..

పాలు మరియు పసుపు:

ఒక స్పూన్ పాల(Milk)ల్లో ఒక స్పూన్ ఆర్గానిక్ పసుపు(Turmeric) వేసి పేస్టులా కలపండి. ఈ పేస్టును అప్లై చేసి ఆరాక సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయండి. దీన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

చక్కెర:

స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ చక్కెర(Sugar), తగినంత నిమ్మరసం వేసి సన్నని మంట మీద చిక్కబడే వరకు కలపండి. గోరువెచ్చగా అయ్యాక మీ పెదవులపై రాయండి. 15 నిమిషాల తర్వాత నీటితో కడగండి. దీనిని తరచుగా చేయడం వల్ల హెయిర్ రిమూవ్ అవుతుంది.వీటిలో మీకు ఏది వీలుగా ఉంటుందో దానిని అనుసరించి మీ పై పెదవి(Lips) పై ఉన్న అవాంఛిత రోమాల నుండి బయట పడండి.

Leave A Reply

Your email address will not be published.