జుట్టు బలంగా, ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగాలంటే పురాతన పద్దతులలో ఉన్న ఈ చిట్కాలను పాటించండి

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు బలమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఈరోజు కథనంలో కొన్ని రకాల ఆకులను ఉపయోగించి జుట్టు ను ఒత్తుగా, నిగనిగలాడే లా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. నేటి కాలంలో సరైన పోషకాహారాన్ని తీసుకోకపోవడం వల్ల జుట్టుకు సరైన పోషణ అందడం లేదు. అందువలన జుట్టు బలహీనంగా మారడంతో పాటు, జుట్టు రాలే సమస్య అధికమైంది. మరియు కాలుష్యంతో కూడిన వాతావరణం వల్ల తలలో చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా అధికమవుతున్నాయి.

దీంతో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి జుట్టు బలంగా, ఆరోగ్యం గా ఉండటానికి తప్పనిసరిగా పౌష్టికాహారం (Nutritious food) తీసుకోవాలి. జంక్ ఫుడ్ ను పూర్తిగా మానేయాలి‌.

ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం (exercise) కూడా చేయాలి. వీటిని పాటిస్తూ కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు బలమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.

ఈరోజు కథనంలో కొన్ని రకాల ఆకులను ఉపయోగించి జుట్టు ను ఒత్తుగా, నిగనిగలాడే లా చేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

బ్రహ్మి ఆకులు :

బ్రహ్మీ మొక్క యొక్క ఆకులు జుట్టు పెరుగుదల (growth) కు ఎంతగానో సహాయపడతాయి. వీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా తోడ్పడతాయి. బ్రహ్మీ ఆకులు వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది .

Follow these age-old tips to grow strong, healthy and thick hair
Image Credit : Telugu Mirror

తులసి ఆకులు:

తులసి ఆకులు కూడా జుట్టు ఆరోగ్యాని (health) కి సహాయపడతాయి. ముఖ్యంగా స్కాల్ఫ్ పై ఉండే చుండ్రు, దురదను తగ్గిస్తాయి. తులసి ఆకుల రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు ఎదుగుదలకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులు కూడా జుట్టును పొడవుగా పెంచేలా చేస్తాయి. తలలో ఉన్న ఇన్ఫెక్షన్ (Infection) మరియు జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించడంలో పుదీనా ఆకులు చాలా బాగా సహాయపడతాయి. అలాగే జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పుదీనా ఆకులు ఉపయోగపడతాయి.

కరివేపాకులు:

జుట్టు సమస్యల (problems) ను తగ్గించుకోవడంలో కరివేపాకులు బాగా సహాయపడుతాయి. కరివేపాకు తో జుట్టును పొడవుగా, ఒత్తుగా మరియు ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. జుట్టు కుదుళ్లను బలంగా చేయడంలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది.

Also Read : Hair Growth : పూర్తి సహజ పద్దతులలో కేశ సంరక్షణకు ఇలా చేయండి.

Precautions for hair colour : దీర్ఘకాల నల్లని జుట్టు కోసం..తప్పని సరి జాగ్రత్తలు మీ కోసం..

లావెండర్:

తలలో ఉండే ఇన్ఫెక్షన్లను మరియు బ్యాక్టీరియాను నిర్మూలించడం (Eradication) లో లావెండర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జట్టు పొడిబారకుండా, మృదువుగా, షైనీ గా ఉంచుతుంది.

Follow these age-old tips to grow strong, healthy and thick hair
image credit : Telugu Mirror

ఉసిరి:

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి (amla) కాయ ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా ఉసిరికాయను జుట్టు సంరక్షణలో బాగా ఉపయోగిస్తారు. జుట్టును ఒత్తుగా చేయడమే కాకుండా జుట్టు నల్లగా మరియు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

కాబట్టి వీటిని ఉపయోగించి జుట్టు రాలే సమస్యను మరియు చుండ్రు, దురద వంటి సమస్యల నుండి సులువుగా బయటపడవచ్చు. తద్వారా ఆరోగ్యంగా, బలంగా, ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండే జుట్టును సొంతం చేసుకోవచ్చు.

Comments are closed.