CM Revanth Reddy Announces For Drivers : క్యాబ్, ఆటో డ్రైవర్ లకు మరియు డెలివరీ బాయ్ లకు తీపి కబురు అందించిన తెలంగాణ ప్రభుత్వం. వివరాలు తెలుసుకోండి

సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తీసుకురానున్న పాలసీల గురించి మరియు ఇతర వివరాలు గురించి తెలియ చేశారు.

Telugu Mirror: శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Ground) లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు, ఈ సమావేశానికి ఆటో డ్రైవర్లు (Auto Driver) , క్యాబ్ డ్రైవర్లు (Cab Driver) , డెలివరీ బాయ్స్ (Delivery Boys) తో వివిధ అంశాల పై చాలాసేపు చర్చించారు, ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి వివరంగా తెలుసుకున్నారు అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆటో డ్రైవర్ల కోసం ఏమి తీసుకురానున్నదో తెలిపారు.

నాలుగు నెలల క్రితం ఒక భవనానికి డెలివరీ చేయడానికి వెళ్లిన స్విగ్గి డెలివరీ బాయ్ రిజ్వాన్ నీ కుక్క తరమడం వల్ల భవనం పై నుంచి కింద పడి మరణించడం నా దృష్టికి వచ్చిందని ఇది చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశారు, ఈ విషయంపై స్పందిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్  (CM Relief Fund) నుంచి రెండు లక్షల రూపాయలు ఆ చనిపోయిన డెలివరీ బాయ్ కుటుంబానికి తక్షణమే అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy Announces For Drivers: Telangana government has given sweet talk to cab, auto drivers and delivery boys. Know the details
image credit : Deccan Chronicle

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర మంతట ఉన్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య ఖర్చులకు పది లక్షల వరకు అందిస్తామని అలాగే యాక్సిడెంట్ పాలసీ కింద ఐదు లక్షలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు, త్వరలోనే ఉబర్, ఓలా మాదిరిగా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా అలాంటి ఒక క్యాబ్ బుకింగ్ యాప్ ని రూపొందించబోతున్నామని ప్రకటించారు.

Also Read: Oppo A59 5G : Oppo తాజా బడ్జెట్ ఫోన్ Oppo A59 5G డిసెంబర్ 25 నుండి రూ.15,000 కి లభిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి

కంపెనీలు కూడా తమ ఉద్యోగుల గురించి మానవతా దృక్పథంతో ఆలోచించాలి అని ఎంతసేపటికి ఆర్థిక పరమైన ప్రయోజనాల ఆలోచనలే కాకుండా ఉద్యోగుల రక్షణ కూడా ముఖ్యమని చెప్పారు, స్విగ్గి డెలివరీ బాయ్ మరణం పట్ల ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయకపోవడం అదేవిధంగా కుటుంబానికి ఎలాంటి సహాయం అందించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మా గవర్నమెంట్ సామాజిక భద్రతకు విలువనిస్తుందని దానికోసం ఎలాంటి నిర్ణయాలు అయినా అమలు చేస్తామని ఆయన అన్నారు.

ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభ (Praja Palana Grama Sabha) లో సమస్యలను రాతపూర్వకంగా లేదా ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చు అన్నారు. వీలైనంత వేగంగా ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా ప్రజలు పంపించిన సమస్యలన్నీటిని పరిష్కరిస్తామని క్యాబ్ డ్రైవర్లకు భరోసా ఇచ్చారు.

Comments are closed.