ఏడేళ్ళ తరువాత భారత్ లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్

భారత్ లో జరిగే వన్డే ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. సుమారు ఏడేళ్ళ తరువాత భారత్ లో అడుగుపెట్టింది పాకిస్తాన్ క్రికెట్ టీం. ప్రస్తుతం వార్మప్ మ్యాచ్ లు ఆడేందుకు హైదరాబాద్ చేరుకుంది పాకిస్తాన్ క్రికె ట్ టీం.

సుమారు ఏడు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత దేశంలో అడుగుపెట్టింది. భారత్ లో జరిగే వన్డే ప్రపంచకప్ (World Cup) క్రికెట్ పోటీలలో పాల్గొనేందుకై పాక్ ఆటగాళ్లు భారత్ కు వచ్చారు. పాకిస్తాన్ క్రికెట్ ఆటగాళ్లు హైదరాబాదులో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు పాక్ క్రికెటర్లకు సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రస్తుతం వీరు బంజారాహిల్స్ లో పార్క్ హయత్ హోటల్ లో బస చేశారు.శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఆటగాళ్ళను పార్క్ హయత్ హోటల్ కి తీసుకువెళ్లారు.

అయితే హైదరాబాదులో వారికి లభించిన స్వాగతానికి పాకిస్తాన్ క్రికెటర్లు సంతోషాన్ని వ్యక్తపరిచారు. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ షా ఆఫ్రిది మీడియా వేదికగా మాట్లాడారు. “ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి గొప్ప సాదర స్వాగతం లభించలేదు.” అనే అర్థం వచ్చేలా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

సెప్టెంబర్ 27న బుధవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేరుకుంది. బాబర్ అజం (Babar Azam) ఆధ్వర్యంలో 15 మంది సభ్యులతో ఉన్న ఆటగాళ్లు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇది ఇలా ఉండగా పాకిస్తాన్ క్రికెట్ టీం హైదరాబాద్ లో పలుచోట్ల మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 29 వ తేదీన న్యూజిలాండ్ (New Zealand) తో వన్డే ప్రపంచ కప్ మొదటి వామప్ మ్యాచ్ ను పాకిస్తాన్ టీం హైదరాబాదులో ఆడనున్నారు.

Also Read : Cricket God Sachin: ‘ క్రికెట్ దేవుడి ‘ యుగం ప్రారంభమైన రోజు.. ఇప్పటి వరకు అందనంత ఎత్తులో నిలిచిన సచిన్ టెండూల్కర్.

పాకిస్తాన్ ఆటగాళ్లకు మంచి రుచికరమైన, అదిరిపోయే ఆహార పదార్థాలను సిద్ధం చేయించారు నిర్వాహకులు. హైదరాబాద్ బిర్యానీ తో పాటు మటన్ కర్రీ మరియు ప్రత్యేకమైన వంటకాలను (Special dishes) వండించారు. ఇవే కాకుండా గ్రిల్డ్ ల్యాంచ్ చాప్స్, గ్రిల్డ్ ఫిష్, బటర్ చికెన్ వంటి వివిధ రకాలు నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేయించారు. మరియు ప్రత్యేకంగా స్టీమ్ చేసిన బాస్మతి రైస్, బోలోగ్నిస్ సాస్ తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ వంటి వాటిని కూడా వండించారు.

Cricket : భారత క్రికెటర్ల లో అత్యంత రిచ్ క్రికెటర్..

పాకిస్తాన్ క్రికెట్ టీం రెండు వారాలపాటు హైదరాబాదులోనే ఉండనున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ వామప్ మ్యాచ్ (Warm-Up Match) ఆడనున్నారు. అక్టోబర్ -3వ తేదీన ఆస్ట్రేలియా (Australia) తో మరో మ్యాచ్ ను ఆడనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సెప్టెంబర్ 28 – గురువారం పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్- 6వ తేదీన పాకిస్తాన్, నెదర్లాండ్స్ (netherlands) టీం తో తొలి మ్యాచ్ ఆడనున్నారు.

Comments are closed.