KTR : ఈ నెల ఎవ్వరూ కరెంటు బిల్లులు కట్టొద్దు, కేటీఆర్ వ్యాఖ్యలు

లండన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy) చేసిన ఘాటు వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎంఎల్ఏ మండిపడ్డారు. 100 మీటర్ల లోపే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం తర్వాత ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనుల్లో ఉండమంటూ కేటీఆర్ హిత బోధ చేసారు.

Telugu Mirror : ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి రూ.15 లక్షల వరకు పెంచిన విషయం మన అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీలలో ఒకటైన గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ విషయంపై కసరత్తు చేస్తుంది.

పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎవరైతే 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వినియోగిస్తున్నవారికి ఇక కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక పై వారికీ కరెంటు బిల్ జీరో వస్తుంది అని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. 100 రోజుల్లోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేస్తుందని తెలిపింది. ప్రస్తుతం గృహ జ్యోతి పథకంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన స్కీం ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న నేపథ్యంలో ఉచిత విద్యుత్ అమలు పై అధ్యయనం చేసారు. ఆ రాష్ట్రాల తరహాలోనే మార్గదర్శకాలు షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరైతే 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడతారో వారికీ కరెంటు బిల్ సున్నా వస్తుందని, ఇచ్చిన అన్ని గ్యారెంటీలు పూర్తి చేస్తామని కాంగ్రెస్ సర్కార్ తెలిపింది.

ktr-no-one-should-pay-electricity-bill-this-month-ktr-comments
Image Credit : Deccan chronical

Also Read :SBI Fixed Deposit : ఎస్బిఐ గ్రీన్ రూపాయి టర్మ్ డిపాజిట్ పథకం, వడ్డీ రేట్లు మరియు ప్రయోజనాలు ఇవే

ఈ నేపథ్యంలో లండన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Reventh Reddy) చేసిన ఘాటు వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎంఎల్ఏ మండిపడ్డారు. 100 మీటర్ల లోపే బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం తర్వాత ముందు 100 రోజుల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనుల్లో ఉండమంటూ కేటీఆర్ హిత బోధ చేసారు. బిఆర్ఎస్ ప్రస్థానంలో ఇలాంటి అహంకారంతో కూడిన వారిని చాల మందిని చూశామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ తీసుకొచ్చినందుకు తెలంగాణ జెండాని పాటి పెడతారా? అంటూ ప్రశ్నించారు.

దీంతో పాటు కరెంటు బిల్లులపై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. జనవరి నెల కరెంటు బిల్లులు ఎవ్వరు కట్టొద్దని పిలుపునిచ్చారు. కరెంటు బిల్లుల గురించి అధికారులు ప్రశ్నిస్తే సీఎం గతంలో మాట్లాడిన మాటలు చూపించాలంటూ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ప్రతి ఒక్క మీటర్ కి ఈ పథకం కింద ఉచిత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు చెప్పినట్టుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను తప్పించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ చెప్పిన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Comments are closed.