Rythu Bandhu : రైతుబంధు పై బిగ్ అప్డేట్, ఈ నెలాఖరులోగా ఖాతాల్లోకి డబ్బులు జమ

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజామాబాద్ జిల్లా ఆంధ్రనగర్ లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రైతుబంధు విషయం పై ఒక క్లారిటీ ఇచ్చారు.

Telugu Mirror : పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి రైతులు గందరగోళానికి గురి అయ్యారు దీనికి కారణం కొంతమంది రైతులకి (రెండు ఎకరాల లోపు వారికి) రైతుబంధు సహాయం అందడం మరికొంత మందికి అందకపోవడం, అయితే మొత్తానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయం పై ఒక క్లారిటీ ఇచ్చారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిజామాబాద్ జిల్లా ఆంధ్రనగర్ లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం పై ఈ విధంగా ప్రస్తావించారు, రైతులు ఎవరు రైతుబంధు రాలేదు అన్ని దిగులు చెందవద్దని, ఈనెల ముగిసేసరికి రైతుబంధుకు సంబంధించిన నగదును దశలువారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు, అంతేకాకుండా త్వరలోనే రుణమాఫీ, రైతు భీమా పథకాలను కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

big-update-on-rythubandhu-money-will-be-deposited-in-the-accounts-by-the-end-of-this-month
Image Credit : Oneindia Telugu

Also Read : Beware Of Filter Water : శుద్ది చేసిన, ఫిల్టర్ చేసిన నీరు మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం; ధీర్ఘకాలంలో ఏర్పడే చిక్కులను తెలుసుకోండి

ఇంకా సమావేశంలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో నాకు మొదటి గురువు ఎన్టీఆర్ అని తెలియజేశారు, ఎన్టీఆర్ గారితో దగ్గర్నుంచి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేను నేర్చుకున్నానని , ఎన్టీఆర్ కూడా నిరంతరం రైతు బాగు కోసమే కృషి చేసే వారిని చెప్పారు, అలాంటి మహనీయుడు ఆశయాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందని హామీ ఇచ్చారు.

అదేవిధంగా మంత్రి అధికారులతో ఇతర విషయాల గురించి చర్చించారు, రైతులకు ఆదాయ మార్గాలు పెంపొదించే విధంగా అధికారులు సహకారం అందించాలని సూచించారు, ఈసారి రాబోయే వేసంగి సీజన్లో యూరియాకి సంబంధించి ఎటువంటి లోటు రాకుండా చూడాలని అధికారులని ఆదేశించారు, అంతే కాకుండా ఈ మధ్య యూరియా కొరతకు సంబంధించిన కారణాలను కూడా అధికారులని అడిగి తెలుసుకున్నారు.

Comments are closed.