తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? కండీషన్ క్రిటికలా?

సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిన్నటితో పోలిస్తే బిపి లెవెల్స్ నార్మల్ స్థాయికి చేరుకున్నట్లు డాక్టర్స్ హెల్త్ బులిటన్ ని విడుదల చేసారు.

Telugu Mirror : సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి నిన్న ఉదయం తన స్వగ్రామమైన తెల్దారిపల్లిలో అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఏజిఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు అతను చికిత్సకు స్పందిస్తున్నారని అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు సూచించారు. నిన్నటితో పోలిస్తే బిపి లెవెల్స్ నార్మల్ స్థాయికి చేరుకున్నట్లు డాక్టర్స్ హెల్త్ బులిటన్ ని విడుదల  చేసారు. 50 శాతానికి పైగా సొంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారని వైద్య బృందం తెలిపింది.

how-is-tammineni-veerbhadras-health-now-condition-critical

Also Read : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకి గుండె పోటు, పరిస్థితి విషమంగా ఉందంటున్న డాక్టర్లు

ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగిస్తున్నామని మరియు ఆ మందుల చికిత్సకు తమ్మినేని స్పందిస్తున్నట్లు తెలిపారు. నిన్న వెంటిలేటర్స్ పైనే అతనికి చికిత్స జరిగింది కాగా  ఇవాళ ఆరోగ్యం నిలకడగా ఉంటె వెంటిలేటర్స్ తీసేసే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతుంది. ఇంకా కాసేపటిలో ఆరోగ్యం నిలకడగా ఉంటె ఐసీయూ నుండి వేరే వార్డ్ కి షిఫ్ట్ చేసే అవకాశం ఉన్నట్లు డాక్టర్స్ చెబుతున్నారు. తమ్మినేని వీరభద్రంకి గుండె, కిడ్నీ మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు.

 

Comments are closed.