Delhi Metro–ఢిల్లీ మెట్రో లో మళ్ళీ లొల్లి…

Telugu Mirror : కాదేదీ ఢిల్లీ మెట్రో లో వైరల్ కి అనర్హం. ఢిల్లీ మెట్రో రైల్ నిత్యం వార్తల్లో ఉంటోంది. మెట్రో అధికారులు ఇటీవల హుకూం జారీ చేసినాగానీ మెట్రో లో ప్రయాణించే వారి తీరు మారటం లేదు. రోజు కొక సంఘటన ఢిల్లీ మెట్రోని వార్తలలో నిలుపుతుంది. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ ట్రాన్స్ జండర్ యాచించడం పై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Mercedes Benz : యూరోప్ మార్కెట్ లోకి రానున్న మెర్సిడెస్ బెంజ్ 2024 CLE కార్..

ఢిల్లీ లో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాహనాల ముందు హిజ్రాలు అడుక్కుంటుంటారు. అయితే ఇప్పుడు ఢిల్లీ మెట్రోలోకూడా హిజ్రాలు యాచించటం మొదలు పెట్టారు.ఢిల్లీ మెట్రో కి సంభంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. వైరల్ అయిన వీడియోలో మెట్రో ప్రయాణీకుడు ఐన ఒక ట్రాన్స్ జెండర్ అదే కోచ్ లో ప్రయాణిస్తున్న ఒక అమ్మాయిని డబ్బు అడుగుతూ కనిపించాడు.ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది మరికొంత మంది ప్రజలు ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేసి మంచి,చెడులు చెబుతున్నారు.

వైరల్ గా మారిన ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ కరణ్ సింగ్ తన ఖాతాలో(Karan Singh..@Karan_Singh_ ) షేర్ చేశారు. గురువారం షేర్ చేసిన వీడియోలో,కోచ్ లోపల ట్రాన్స్ జెండర్ అడుక్కుంటూ కనిపించాడు. ట్విట్టర్ యూజర్ కరణ్ సింగ్ ఢిల్లీ మెట్రోని (DMRC ) ట్యాగ్ చేస్తూ మేము లోకల్ రైలు లేదా బస్సులలో ప్రయాణించడం లేదని DMRC గుర్తుపెట్టుకోవాలని సూచించారు.అలాగే ప్రయాణ సమయం లో ఇలాంటి సంఘటనలు ఏ రకంగానూ అంగీకరించలేమని ,ప్రయాణీకుల భద్రతను గురించి ఆలోచించాలని కరణ్ DMRC కి సూచించారు.

జూలై 6వ తేదీ ఉదయం 11.30 గంటలకు కరణ్ సింగ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను 42 వేల మందికి పైగా చూశారు. వీక్షించడమే కాకుండా విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. కరణ్ సింగ్ చేసిన ట్వీట్ కు DMRC స్పందిస్తూ దయచేసి కోచ్ నంబర్ ఇవ్వండి అని బదులిస్తూ మెట్రో లోపల,వెలుపల కోచ్ నంబర్ వ్రాసి ఉంటుందని ,కోచ్ నంబర్ వ్రాయబడిన గుర్తు కోసం DMRC ఫోటోని కూడా జోడించింది.

DMRC ట్వీట్ పై కరణ్ సింగ్ స్పందిస్తూ,కోచ్ నంబర్ తెలియదని,కోచ్ నంబర్ ను ఎలా గుర్తుంచుకోవాలని కరణ్ బదులిచ్చాడు.అలాగే ఈ వీడియో ఢిల్లీ మెట్రో రెడ్ లైన్ మహిళా కోచ్ లోపలిదని,దానిని తన స్నేహితుడు చిత్రీకరించాడని కరణ్ తన ట్వీట్ ద్వారా DMRC కి తెలిపాడు.అతని స్నేహితుడు ఇచ్చిన సమాచారం ప్రకారం రెడ్ లైన్ యొక్క షహీద్ స్థల్ నుండి దిల్షాద్ గార్డెన్ రూట్ లో మేజర్ మోహిత్ శర్మ స్టేషన్ సమీపంలో ఉదయం 9.30 గంటలకు ఈ సంఘటన జరిగింది.

ఇదిలావుండగా ఈ వీడియో పై ఢిల్లీ మెట్రో నిర్వహణపై వినియోగ దారులు చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. మెట్రోలో రోజుకు ఒక కొత్త సంఘటన జరుగుతుందని,క్రాస్ రోడ్ లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిన అనుభూతి కలుగుతుంది అని ఒక యూజర్ రాశారు. ఢిల్లీ మెట్రో ముంబయి లోకల్ ట్రైన్ లా మారిందని మరొక నెటిజన్ అభిప్రాయ పడ్డారు. మరి కొంతమంది ఫిర్యాదు చేసిన వ్యక్తిని కోచ్ నంబర్ అడగడం పై DMRC ని నిందిస్తున్నారు.అలాగే ఢిల్లీ మెట్రో లో CCTV లను అమర్చారు కదా వాటి పర్యవేక్షణ కోసం చాలా మంది సిబ్బందిని ఎందుకు నియమించారని ట్వీట్ చేశారు. మీరు ఈ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నారు కదా అని అడుగు తున్నారు. ఫిర్యాదు దారుడు జరిగిన సంఘటన మీద ఫిర్యాదు చేశారు,అది చాలదా అని DMRC ని అడుగుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.