Nail Polish : వికృతమైన నెయిల్ పెయింట్ మీ చేతి అందాన్ని చెడగొడుతుందా ? సూపర్ డూపర్ టిప్స్ తో తొలిగించండి ఇలా..

Telugu Mirror : స్త్రీలు తాము అందంగా కనిపించాలి అని అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. దుస్తుల విషయంలో, మేకప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అందరిలో ప్రత్యేకంగా, ఆకర్షణీయం(Attractive)గా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. ఇలా అన్ని వయసుల వారు అనుకుంటూ ఉంటారు .ఆడవారు దుస్తులు ,మేకప్ విషయంలోనే కాదు ప్రతి ఒక్క విషయంలోనూ శ్రద్ధ చూపుతుంటారు. వాటిలో గోళ్లు ఒకటి. గోళ్ళ(Nails)ను దుస్తులకు మ్యాచింగ్ అయ్యే విధంగా రకరకాల నెయిల్ పాలిష్ వాడుతుంటారు. బట్టలు మ్యాచింగ్ తగిన విధంగా నెయిల్ పాలిష్ కలర్ ను సెలెక్ట్ చేసుకుంటారు.

Cancer : అలర్ట్.. అధిక చక్కెర అత్యంత ప్రమాదం..కాన్సర్ కు కారణమవ్వనుందా ?

నెయిల్ పాలిష్(Nail Polish) వేసుకోవడం చాలా ఈజీ .అయితే తీసివేయడం మాత్రం చాలా ఇబ్బంది .మీ దగ్గర నెయిల్ రిమూవర్ లేనప్పుడు అవి ఎలా తీయాలో అని ఆలోచించడం అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మేము మీ పాత నైల్ పాలిష్ ని రిమూవర్ లేకుండా ఎలా తొలగించుకోవచ్చు అనేది చెప్పబోతున్నాం. దీనికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు.టూత్ పేస్ట్ పళ్ళు క్లీన్ చేయడానికే కాదు దీనికి కూడా ఉపయోగపడుతుంది. టూత్ పేస్టును ఉపయోగించి నెయిల్ పోలిష్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం గోళ్ళపై టూత్ పేస్ట్ రాయాలి. స్మూత్ గా ఉండే బ్రష్ తీసుకుని మెల్లగా రుద్దాలి ఈ విధంగా చేస్తే నెయిల్ పాలిష్ పోతుంది .

Image Credit : Styles at life

ChatGPT: అద్భుతమైన సామర్థ్యంతో దూసుకెళ్తున్న OpenAI ChatGPT..ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లోకి..

  • టూత్ పేస్టు(Tooth Paste)లో బేకింగ్ సోడా వేసి కలిపి గోళ్ళపై రాస్తే పాత నెయిల్ పోలిష్ రిమూవ్ అవుతుంది.
  • గోరువెచ్చని నీటిలో మీ గోళ్ళ(Nails)ను 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టాలి. క్రమంగా పాత నెయిల్ పోలిష్ తొలగిపోతుంది .
  • గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలపండి. గోర్లను ఈ నీటిలో నానబెట్టండి. దీంతో మీ గోళ్ళకు ఉన్న పాత నెయిల్ పాలిష్ పూర్తిగా క్లీన్ అవుతాయి.
  • గోరువెచ్చని నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్(Hydrogen Peroxide) కలిపి ఆ నీటితో గోళ్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ను తొలగించుకోండి .ఈ నీటిని గోళ్ళకు రాసి నెయిల్ పాలిష్ ఫైలర్ తో రుద్దితే పాత నెయిల్ పోలిష్ రిమూవ్ అవుతుంది.
  • వెనిగర్ తో కూడా రిమూవ్ చేయవచ్చు .దీనికోసం వెనిగర్(Vinegar) లో నిమ్మరసం కలపాలి. దీనిని గోళ్ళకు రాసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి .ఈ విధంగా చేస్తే పాత నెయిల్ పాలిష్ వదిలిపోతుంది.

వీటిల్లో మీకు ఏవి అనుకూలంగా ఉంటాయో వాటిని అనుసరించి మీ గోళ్ళకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ని తొలగించుకోండి.

Leave A Reply

Your email address will not be published.