AP Inter results 2024, Useful news: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదల. సత్తా చాటిన బాలికలు, పూర్తి సమాచారం ఇక్కడ.

AP Inter results 2024: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరం ఫలితాలలో 67 శాతం ఉత్తీర్ణత నమోదు అవగా ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఇది 78 శాతంగా ఉన్నది. అయితే ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో బాలికలే అగ్రభాగాన నిలవడం విశేషం.

AP Inter results 2024 :

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ అధికారులు ఈరోజు విజయవాడలో విడుదల చేశారు.

AP Inter results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి, కన్వీనర్ నేడు విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉండగా. 81శాతం ఉత్తీర్ణతతో గుంటూరు రెండో స్థానంలో నిలిచింది. 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడవ స్థానంలో ఉంది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలలో కృష్ణా జిల్లా 90 శాతం ఫలితాలను సాధించి ప్రధమ స్టానంలో ఉండగా, 87 శాతం ఉతీర్ణత సాధించి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు సెంకడ్ ప్లేస్ లోనూ అలాగే 84 శాతం ఉతీర్ణతతో విశాఖ మూడవ స్థానంలో ఉంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో అల్లూరు జిల్లా 48శాతం ఉత్తీర్ణతతో చివరిస్థానం సాధించింది. మరో వైపు ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో 63శాతం ఉత్తీర్ణత సాధించిన చిత్తూరు జిల్లా చివరి స్థానంలో ఉంది.

AP Inter results 2024
Image Credit :Telugu Mirror

మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో మార్కులపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీవెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు. అదేవిధంగా ఉత్తీర్ణత సాధించని (Fail) విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మరియు ఇంప్రూమెంట్ రాయాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు.సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహిస్తారు. పరీక్షల వివరాలు త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు

AP Inter results 2024 : ఈ ఏడాది కూడా బాలికలదే పై చేయి

ఈ రోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఈ ఏడాది కూడా బాలికలే పై చేయి సాధించారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో పాస్ పర్సంటేజ్‌లో బాలికలే అగ్ర భాగాన నిలిచారని ఆయన పేర్కొన్నారు.

AP Inter results 2024 :

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలలో మొత్తం 4,61,273 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 3,10,875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 67 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవ్వగా, వీరిలో 3,06,528 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలలో బాలికల ఉత్తీర్ణత శాతం 78 గా ఉంది. ఒకేషనల్ కోర్స్ మొదటి ఏడాది పరీక్షకు 38,483 మంది హాజరవగా, 23,181 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండియర్ ఒకేషనల్ కోర్స్ పరీక్షలను 32,339 మంది విద్యార్థులు రాయగా 23,000 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలలో

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 2,26,240 మంది పరీక్షకు హాజరైతే, 1,43,688 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 64 శాతం.
మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు బాలికలు 2,35,033 మంది పరీక్ష రాయగా 1,67,187 మంది పాస్ అయ్యారు. 71 శాతం ఉత్తీర్ణతతో ఈ సంవత్సరం కూడా బాలికలే పైచేయి సాధించారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలలో

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 1,88,849 మంది బాలురు హాజరవ్వగా, 1,44,465 మంది ఉత్తీర్ణులు అయ్యారు. ఉత్తీర్ణతా శాతం 75.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,04,908 మంది బాలికలు పరీక్షకు హాజరవ్వగా, 1,65,063 మంది బాలికలు పాస్ అయ్యారు. బాలికల ఉత్తీర్ణతా శాతం 81. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది.

ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలను పొందవచ్చు.

Also Read: TS TET registration date extended useful news : టీఎస్ టెట్ దరఖాస్తు గడువు పెంపు, ఎప్పటివరకంటే..?

Comments are closed.