JEE Mains 2 Exam : ఈరోజు నుండే జేఈఈ మెయిన్స్ – 2 పరీక్షలు మొదలు.. తెలంగాణలో 11 కేంద్రాల్లోనే పరీక్ష నిర్వహణ..

పరీక్షలు దేశవ్యాప్తంగా 291 నగరాలు మరియు 544 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

JEE Mains 2 Exam : జేఈఈ మెయిన్-2 పరీక్షలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా 291 నగరాలు మరియు 544 కేంద్రాలలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

పరీక్ష సమయాలు..

ఈ పరీక్షను మన తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేల మంది రాయనున్నారు. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు వెళ్ళాలి. ఇంగ్లీషుతోపాటు తెలుగు, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తారు. BE మరియు BTech పరీక్ష సాధారణ విద్యార్థులకు మూడు గంటలు మరియు దివ్యంగులకు నాలుగు గంటలు పరీక్ష ఉంటుంది.

BARC మరియు BPlanning పరీక్షలు సాధారణ విద్యార్థులకు మూడున్నర గంటలు, వికలాంగులకు నాలుగు గంటల పది నిమిషాలు ఉంటాయి. ఈ నెల 4, 5, 6 తేదీల్లో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎన్‌టీఏ ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. మరికొందరి అడ్మిట్ కార్డులను త్వరలోనే వెల్లడిస్తారు.

ఐదు జిల్లాలను తొలగించారు..

JEE పరీక్షలు నిర్వహించే స్థానాల జాబితా నుండి రాష్ట్రంలోని ఐదు నగరాలు తోలించారు. గతంలో, రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, ఈసారి 11కే పరిమితం కాగా.. ఈసారి కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్, సూర్యాపేట, హైదరాబాద్, మరియు సికింద్రాబాద్ మాత్రమే ఉన్నాయి. ఈసారి పరీక్షా కేంద్రాల జాబితా నుంచి జనగామ, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల పట్టణాలను తొలగించారు.

JEE Mains 2 Exam

పరీక్ష తేదీలు..

పేపర్-1 (BE/B.Tech): ఏప్రిల్ 4, 5, 6, 8, 9.
పేపర్-2 (ఎ) మరియు 2 (బి) గడువు : ఏప్రిల్ 12న

పరీక్షా సమయం..

మొదటి షిఫ్ట్ : ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు.
రెండవ షిఫ్ట్ : 3-6 PM (గమనిక : BARC మరియు BPlanning కోసం అదనపు సమయం అందిస్తారు)

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి భాగం..

జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌ మొదటి భాగంలో తెలుగు రాష్ట్రాల నుంచి 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ సాధించారు. జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. జేఈఈ మెయిన్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను తీసుకోవచ్చు. అడ్వాన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది. లేదంటే ఎన్‌ఐటీలకే పరిమితం అవ్వాలి. ఈసారి JEE మెయిన్ 2024 పరీక్షలకు 12 లక్షల మంది హాజరుకానున్నారు.

JEE Mains 2 Exam

Comments are closed.