TS Polycet 2024 Results : నేడే తెలంగాణ పాలిసెట్‌ రిజల్ట్స్‌.. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల.

విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ పాలిసెట్ - 2024 ఫలితాలు జూన్‌ 3వ తేదీ విడుదల కానున్నాయి.

TS Polycet 2024 Results : డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను జూన్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్‌, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్‌ శ్రీ బి. వెంక‌టేషం, ఎస్‌బీటీఈటీ ఎస్‌.వీ భ‌వ‌న్‌, మాస‌బ్ ట్యాంక్‌ హైద‌రాబాద్‌లో పాలిసెట్ 2024 ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 24న పాలీసెట్ పరీక్ష జరిగింది.

మొత్తం 92,808 మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు, వాస్తవానికి 82,809 (89.23 శాతం) మంది హాజరయ్యారు. వారి స్కోర్లు మరియు ర్యాంకుల ఆధారంగా, విద్యార్థులు ఇంజనీరింగ్, వ్యవసాయం, మత్స్య మరియు ఉద్యానవనాలలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందుతారు. పాలిసెట్ ఫలితాలను https://sbtet.telangana.gov.inలో చెక్ చేయవచ్చు.

TS Polycet 2024 Results

జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 22వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు (Web Options) ఇచ్చుకునే అవకాశం ఉండగా, జూన్ 30వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక జూలై 7వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ (Second Phase Counselling) మొదలు కానుంది. జులై 13వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. జూలై 23వ తేదీన స్పాట్‌ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదలవుతాయి. జూలై 24వ తేదీలోపు ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

TS POLYCET రిజల్ట్స్ ని ఇలా చెక్ చేసుకోవచ్చు :

  • ముందుగా అధికారిక https://sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • “డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డ్” ఎంపికపై క్లిక్ చేయండి.
  • మీ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  • ర్యాంక్ కార్డ్‌లో మీ పేరు, హాల్ టిక్కెట్ నంబర్, సబ్జెక్ట్ వారీగా మార్కులు, మొత్తం మార్కులు మరియు అర్హత స్థితి వంటి వివరాలు ఉంటాయి.
  • ఆ తర్వాత ర్యాంక్ కార్డు ని డౌన్ లోడ్ (Download) చేసుకోండి.

TS Polycet 2024 Results

Comments are closed.