Pavan-Charan memories : రామ్ చరణ్ వద్ద పవన్ కళ్యాణ్ అప్పు తీసుకున్నాడట.. అసలు నిజం ఇదే!

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకు అయిన రామ్ చరణ్ వద్ద కొంత డబ్బు అప్పు చేసాడు. వివరాల్లోకి వెళ్తే..

Pavan-Charan memories : మెగాఫ్యామిలీ వరుసగా సంబరాలు చేసుకుంటున్నారు. మెగా వారసురాలు క్లింకర పుట్టడంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది మెగాఫ్యామిలీ. RRR చిత్రంలోని నాటునాటు పాటకు అవార్డు లభించింది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కొంతకాలం తర్వాత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కేంద్రం చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. ఆ తర్వాత చిరంజీవి భార్య సురేఖ ‘అత్తమ్మ కిచెన్‌’ పేరుతో వ్యాపారిని మొదలు పెట్టారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ సంబరాలు ఇప్పట్లో ముగిసేలా లేవు.

అయితే, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ తన అన్న కొడుకు అయిన రామ్ చరణ్ వద్ద కొంత డబ్బు అప్పు చేసాడు. మరి ఇంతకీ ఎంత అప్పు చేశాడు? అసలు డబ్బు తీసుకోవడానికి అసలు కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పవన్ విజయం అన్నకి అంకితం :

తన విజయాన్ని అన్న చిరంజీవికి అంకితం చేసి పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పాదాల మీద పడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన మెగా అభిమానులు ఎమోషనల్ అయ్యారు. రామ్ చరణ్ తో పాటు ఫ్యామిలీ అంతా, ఆయన పక్కనే ఉండి.. పవన్ విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిపించారు.

pavan-charan-memories

కానీ, పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ దగ్గర డబ్బులు తీసుకున్నది ఇప్పుడు కాదు. కెరీర్ బిగినింగ్ లో డబ్బు తీసుకున్నాడు. అప్పటికి ఇంకా చరణ్ వృత్తి పారంభం కూడా అవ్వలేదు మెగా ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంగా ఉన్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీగా ఉండేవారట. అప్పుడు, పాకెట్ మనీ కోసం చాలా ఇబ్బంది పడేవారట.

చిరంజీవి ఇచ్చిన పాకెట్ మనీ అయిపోగా, చిరంజీవి చరణ్ కోసం ఇచ్చిన పాకెట్ మనీని పవన్ అప్పుగా అడిగేవాడట. పవన్ చరణ్ ని మాయ చేసి, మళ్ళీ వడ్డీతో కలిపి మనీ ఇస్తా అని చెప్పి చరణ్ దగ్గర అప్పు తీసుకునేవాడట. ఈ విషయం గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో పవన్-చరణ్ ఈ అద్భుతమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇవి చెప్పుకుంటూ ఇద్దరూ నవ్వుకున్నారు కూడా.

అంతే కాదు, రామ్ చరణ్, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మధ్య టైం పాస్ అవ్వాలని చిన్న చిన్న గొడవలు చేసేవాడు పవన్ కళ్యాణ్. బ్యాచిలర్ గా ఉన్న సమయంలో, పెద్ద కుటుంబం భలే ఆనందంగా ఉండేది. చిరంజీవి నివాసంలోనూ ఇదే సందడి కొనసాగుతోంది. విడివిడిగా ఉంటున్నప్పటికీ ప్రత్యేక సందర్భాల సమయంలో అందరూ మెగాస్టార్ ఇంటికి చేరుకుంటారు.

ఎన్నో కష్టాలు, మాటలు, అవమానాల తర్వాత పవర్ స్టార్ రాజకీయంలో విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన శాఖలను తీసుకున్న పవన్.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మరి సినిమాల గురించి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పవన్.

Pavan-Charan memories

Comments are closed.