అక్టోబర్ నెలలో OTT లో సందడి చేయనున్న తెలుగు సినిమాలు, ఆ సినిమాల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం

ఈ నెలలో వచ్చే సినిమాల జాబితానూ మరియు అవి ఏ ప్లాట్ ఫారంలో విడుదల అవనున్నాయో పూర్తిగా వివరిస్తున్నాము. ఈ నెలలో మీరు చూడాలనుకున్న సినిమాలపై ఓ లుక్కేయండి..

Telugu Mirror : ప్రతి ఒక్కరు తమ పనుల్లో బిజీ అయిపోయి కాస్త విశ్రాంతి దొరికితే ఎంటర్టైన్ (Entertain) అవ్వాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కువగా OTT లో మూవీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు . OTT లో జరుగుతున్న హవా అంతా ఇంతా కాదు . OTT లో వచ్చిన సినిమాలకి క్రేజ్ బాగా పెరిగిపోతుంది. ఇక కొన్ని సినిమాలు అయితే నేరుగా OTT లోనే విడుదల చేస్తున్నారు. సినిమా థియేటర్ కి వెళ్లినప్పటికీ OTT లో విడుదలయ్యే సినిమాల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. సాధారణంగా , ఎక్కువగా తెలుగు కంటెంట్ ఉన్న సినిమాలు అమెజాన్ ప్రైమ్ , ఆహా  , నెట్‌ఫ్లిక్స్, SUN NXT మరియు హాట్‌స్టార్ యాప్‌లలో కనిపిస్తాయి. అయితే ఒక మంచి సినిమాని చూసేందుకు మీరు కూడా OTT లో విడుదలయ్యే మూవీ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం తాజాగా ఈ నెలలో వచ్చే సినిమాల జాబితానూ మరియు అవి ఏ ప్లాట్ ఫారంలో విడుదల అవనున్నాయో పూర్తిగా వివరిస్తున్నాము. ఈ నెలలో మీరు చూడాలనుకున్న సినిమాలపై ఓ లుక్కేయండి..

OTT లోకి విడుదలవనున్న సినిమాలు ..

1. ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
మంచి థ్రిల్ ఉన్న సినిమా “ది గ్రేట్ ఇండియన్ సూసైడ్” . విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో రామ్ కార్తీక్ మరియు హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కచ్చితంగా మంచి థ్రిల్ ని  ప్రేక్షకులకి  ఇస్తుంది అని మేకర్స్ చెప్పుకొచ్చారు. OTT లో త్వరలోనే రిలీజ్ అవనున్న ఈ సినిమాను వీక్షించండి.

Now let's know the list of Telugu movies that will be buzzing on OTT in the month of October
Image Credit : OTT Play

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్  OTT రిలీజ్ డేట్ : 6 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : ఆహా

2.మిస్టర్ ప్రెగ్నెంట్

బిగ్ బాస్ ఫేమ్ అయినా సోహెల్ నటించిన ఈ సినిమా ప్రజలను అంతగా ఆకట్టుకోలేకపోయింది . ప్రస్తుతం ఈ సినిమా OTT లో సందడి చేసేందుకు సిద్దమవుతుంది. ఎమోషనల్ డ్రామా తో కూడిన ఈ సినిమా ఆహాలో సందడి చేయనుంది.

Now let's know the list of Telugu movies that will be buzzing on OTT in the month of October
Image Credit : Gold Andhra News

మిస్టర్ ప్రెగ్నెంట్  OTT రిలీజ్ డేట్ : 06 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం :  ఆహా

3. ప్రేమ విమానం

శాన్వి మేఘన మరియు సంగీత్ శోభన్ కలిసి జంటగా నటించిన సినిమా ప్రేమ విమానం. ఎమోషనల్ మరియు ఎంతో ఫన్ తో రూపొందిన ఈ సినిమా త్వరలోనే OTT లోకి రానుంది. అనసూయ , వెన్నెల కిషోర్ , దేవాన్ష్‌ నామా, అనిరుద్ నామా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

Now let's know the list of Telugu movies that will be buzzing on OTT in the month of October
Image Credit : OTT Play

ప్రేమ విమానం OTT రిలీజ్ డేట్ : 13 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : Zee5 సినిమా

4. మాన్షన్ 24

బుల్లి తెర పై పేరు సంపాదించుకున్న ఓంకార్ తన దర్శకత్వం లో  “మాన్షన్ 24”  అనే సిరీస్ ను  తెరకెక్కించారు . మాన్షన్ 24 సిరీస్  కి ఓంకార్ దర్శకత్వం వహించగా ఈ హర్రర్ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్, అవికా గోర్ ప్రధాన పాత్రలుగా నటించారు. ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ఇప్పటికే వచ్చేసింది. అయితే మాన్షన్ 24 ప్రస్తుతం OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది .

Now let's know the list of Telugu movies that will be buzzing on OTT in the month of October
Image Credit : Zoom Tv

మాన్షన్ 24 OTT రిలీజ్ డేట్ : 17 అక్టోబర్ 2023
ప్లాట్ ఫారం : డిస్నీ+ హాట్‌స్టార్

5. ఏజెంట్

అఖిల్ అక్కినేని నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్ ‘ ప్రస్తుతం’ OTT లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 29 న సోనీ లివ్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల చేత వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా త్వరలో సోని లివ్ లో విడుదల కానుంది.

Now let's know the list of Telugu movies that will be buzzing on OTT in the month of October
Image Credit : OTT Raja

ఏజెంట్ మూవీ రిలీజ్ డేట్ : త్వరలో
ప్లాట్ ఫారం : సోని లివ్

 

Comments are closed.