మీడియం రేంజ్ సెగ్మెంట్ లో అదిరిపోయే ఫీచర్లు, ఆరా లైట్ తో అద్భుతంగా ఫొటోలు

3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ VIVO V-29 5G అల్ట్రా స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. స్మార్ట్ ఆరా లైట్‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ తక్కువ వెలుతురులో కూడా ప్రకాశవంతమైన కాంతిని అందిస్తుంది.

Telugu Mirror : చైనాకి సంబంధించిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో భారత్ దేశం లో అద్భుతమైన ఫోన్లను లాంచ్ చేసి చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం V- సిరీస్ లో కొత్త మోడళ్ల ఫోన్లను చైనా కంపెనీ తీసుకొచ్చింది. ఆకట్టునే ఫీచర్స్ తో అదిరిపోయే స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. వివో v29 5G ఫోన్ ఇప్పుడు విక్రయంలో ఉంది. దీని  ఫీచర్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Vivo V29 5G ఫీచర్స్ …

1. ఈ ఫోన్ 8 GB + 128 GB వేరియంట్ తో వచ్చింది.
2 . ఇది 17.22 సెం.మీ (6.78 అంగుళాల) తో పూర్తి HD AMOLED డిస్ప్లే ని కలిగి ఉంది.
3.  50MPబ్యాక్ కెమెరా, 8MP వైడ్ Angle కెమెరా , 2MP బ్యాక్ కెమెరా తో మరియు  50MP ఫ్రంట్ కెమెరాతో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది.
4. 4600 mAh బ్యాటరీ ని కలిగి ఉంది.
5. ఈ వివో V29 సిరీస్ 778G ప్రాసెసర్ తో పని చేస్తుంది.

Also Read : డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డ్ లు జారీ చేసే నిబంధనలలో మార్పులు. అక్టోబర్ 1 నుండి అమలులోకి

Vivo V29 5G,  3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ అల్ట్రా స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. స్మార్ట్ ఆరా లైట్‌తో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ తక్కువ వెలుతురులో కూడా ప్రకాశవంతమైన కాంతిని అందిస్తుంది. మెరుగైన ఫీల్డ్ ఆఫ్ వ్యూ మరియు ఆటో ఫోకస్ (AF)తో కూడిన 50 MP ఫ్రంట్ కెమెరా మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సెల్ఫీలను క్యాప్చర్ చేసేందుకు ఆఫర్ చేసారు. టాప్ ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్‌ల ప్రేరణతో రూపొందించబడిన ఈ ఫోన్, మీరు సోషల్ మీడియాలో తక్షణమే పోస్ట్ చేయగల ఆకట్టుకునే వెడ్డింగ్ పోర్ట్రెయిట్‌లను క్యాప్చర్ చేయడానికి వీలుగా ఉంటుంది.

amazing-features-in-the-medium-range-segment-amazing-photos-with-aura-light-with-vivo-v29-5g

80 W ఫాస్ట్ ఛార్జ్‌తో ఈ ఫోన్ లభిస్తుంది, మీరు కేవలం 18 నిమిషాల్లో బ్యాటరీని 1% నుండి 50% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 50 MP OIS నైట్ కెమెరాతో కూడా ప్యాక్ చేయబడింది, మీరు అందమైన మూన్‌లైట్ చిత్రాలను ఎటువంటి ఆలోచన లేకుండా క్లిక్ చేసుకునే కొత్త ఫీచర్స్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ , హిమాలయన్ బ్లూ లాంటి ఆకర్షించే రంగులతో లభ్యమవనున్నాయి.

అల్ట్రా స్లిమ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లే

ఈ ఫోన్ మృదువైన మరియు సున్నితమైన కర్వ్డ్ సర్ఫేస్ మరియు స్ట్రీమ్‌లైన్డ్ 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 0.746 సెంమీ (7.46 మిమీ) మందంతో, ఇది చూడడానికి ఆకట్టుకునే డిజైన్‌ను మరియు సౌకర్యవంతంగా పట్టుకునే విధంగా ఉంటుంది.

Also Read : NPS VS OPS : పెన్షన్ విధానంపై ఉద్యోగుల నిరసనలు ఎందుకు? పాత, కొత్త పెన్షన్ విధానాలపై తేడా తెలుసుకోండి

మారుతున్న రంగు ఉష్ణోగ్రతలతో కొత్త తరం స్మార్ట్ ఆరా లైట్‌తో, తక్కువ వెలుతురులో కూడా ఎల్లప్పుడూ మరియు ప్రతిచోటా అద్భుతంగా ప్రకాశించేలా మిమ్మల్నిక్యాప్చర్ చేస్తుంది . ఆరా లైట్, విజువల్ అప్పీల్‌ని పెంచడమే కాకుండా, ఆకట్టుకునే లైటింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ అక్టోబర్ 17న రూ. 32,999 తో ఫ్లిప్ కార్ట్ లో  మరియు రిటైల్ స్టోర్స్ లో అందరికి అందుబాటులోకి రానున్నాయి. కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు మంచి బ్యాంకు ఆఫర్లను కూడా అందిస్తుంది.

Comments are closed.