Pushpa 2 The Rule : బన్నీ ఫ్యాన్స్‏‏కు గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.

అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ పుష్పరాజ్ కాలి పోస్టర్ రిలీజ్ చేశారు.

Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon star Allu Arjun) హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్ గా రాబోతున్న క్రేజీ మూవీ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప రాజ్‌గా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) మళ్లీ ఆ పాత్రలోకి రానున్నాడు. పాన్-ఇండియా (Pan-India) చిత్రంగా విడుదలైన ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా వసూళ్లు రాబట్టింది. అయితే, చిత్ర దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కి దర్శకత్వం వహించడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పుష్ప 2 సీక్వెల్‌ను (Pushpa 2 sequel) ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసి మరింత ప్రజాదరణ పొందాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు బన్నీ, ఇటు సుక్కు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ పై ఓ కన్నేస్తున్నారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా చిత్రబృందం ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా టీజర్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడే టీజర్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది.

Pushpa 2 The Rule

పుష్ప 2 ది రూల్ సినిమా టీజర్ ను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఎక్స్ (Twitter) వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా కాలికి గజ్జెలు కట్టి నడుస్తున్న ఫొటోను షేర్ చేసి మరీ టీజర్ విడుదల తేదీని చెప్పింది. అయితే అది పుష్ప రాజ్ కాలులాగే కనిపిస్తుంది. ఒక్క పోస్టర్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకర్స్, టీజర్ తో ఏ రేంజ్ లో అంచనాలు పెంచేస్తారో చూడాలి మరి.

పుష్ప 2 షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినా నెట్టింట మాత్రం ఈ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడుతుందని రూమర్స్ నడుస్తున్నాయి. దీంతో ప్రతి అప్డేట్ లోనూ గ్రాండ్ రిలీజ్ ఆగస్ట్ 15 అంటూ మూవీ టీం చెబుతుంది .

మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ ఫహద్‌ ఫాసిల్‌ విలన్‌గా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Pushpa 2 The Rule 

Comments are closed.