OTT : ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాల్లో టాప్ 3 ఇవే..ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి..

ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో వస్తుంటాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయినా చిత్రాల్లో చూడతగిన సినిమాలు గురించి తెలుసుకుందాం.

Telugu Mirror : ఇప్పుడు ఓటీటీ సినిమాలు వారం వారం పోటీ పడుతున్నాయి. ఇలా ఒకేసారి ఓటీటీలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెరిగిపోతూ ఉంది. అయితే ఈ మధ్య కాలం లో ఓటీటీలో రిలీజ్ అయినా చిత్రాల్లో టాప్ 3 బెస్ట్ మూవీస్ గురించి ఇప్పుడు మేము మీకు తెలియజెస్తున్నాము. ఈ వారాంతంలో చూడాల్సిన టాప్ 3 తాజా OTT చిత్రాలు వివరాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

1. ఊరు పేరు  భైరవకోన :

These are the top 3 movies streaming on OTT. Watch it now so you don't miss out

సందీప్ కిషన్ తాజాగా ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో రీసెంట్‌గా హిట్టు కొట్టాడు . ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వీఐ ఆనంద్‌ డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 16న థియేటర్లో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ఎందులో రిలీజ్ అవుతుందో చూద్దాం. ఊరు పేరు భైరవకోన సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో రిలీజైన ఒక నెల లోపే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్‌ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రవిశంకర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో కనిపించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.

Also Read : Zero Current Bill: రేషన్ కార్డు ఉంటే చాలు ఇక కరెంటు బిల్ జీరో, గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

2. 12Th ఫెయిల్ :

These are the top 3 movies streaming on OTT. Watch it now so you don't miss out

ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ + హాట్‌స్టార్‌లో మంగళవారం ఉదయం నుంచి తెలుగులో ప్రసారమవుతుతున్నది. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఎందరో యువకులు ప్రేరణ చెందారు. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో దీనిని తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు కూడా పోటీపడనుంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో ఉన్న ఏకైక ఇండియన్‌ సినిమాగా ఇది రికార్డ్‌కెక్కింది. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌ సాధించింది. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌-2024లో ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది.

Also Read : Free 1 Thulam Gold In Telangana:మహిళలకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, ఉచితంగా తులం బంగారం, ఎప్పటి నుండో తెలుసా?

3. అన్వేషిప్పింగ్ కండెతుమ్ :

These are the top 3 movies streaming on OTT. Watch it now so you don't miss out

టోవినో థామస్‌ తెలుగు ప్రేక్షకులందరికి తెలియకపోవచ్చు కానీ ఆయన నటించిన సినిమాల పేరు చెబితే చాలా మంది తెలుగు వారు గుర్తు పడతారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన 2018 సినిమా గుర్తింది కదా వందకోట్లకు పైగా వసూలు చేసిన ఈ మలయాళ హిట్‌ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు టోవినో థామస్‌. ఇక ఆయన హీరోగా నటించిన లేటెస్ట్‌ మలయాళ సినిమా అన్వేషిప్పన్‌ కండతుమ్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Comments are closed.