Health Tips : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు శరీర బరువును తగ్గించే దివ్యౌషదం బెల్లం టీ

చలికాలంలో రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి రోగ నిరోధక శక్తి ని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. బెల్లం టీ త్రాగడం వలన బరువు తగ్గడంతో పాటు, కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో (Winter) శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. వాతావరణం మారినప్పుడు సీజన్ కు అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

చలికాలంలో రోగాలు వ్యాప్తి చెందే అవకాశాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే సూర్య కిరణాలు (sun rays) తక్కువగా ఉంటాయి కాబట్టి.

అలాగే చలికాలంలో చాలా బద్దకం (Laziness) గా కూడా ఉంటుంది. జీవక్రియ మందగిస్తుంది.చాలామంది చలి కారణంగా వ్యాయామం (exercise) చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. దీనివల్ల ఫిట్ నెస్ ను కోల్పోతారు.

Also Read : Health Tips : తీవ్రంగా బాధించే టాన్సిల్స్ సమస్యను తేలికగా తగ్గించే మార్గాలు

చలికాలంలో రోగ నిరోధక శక్తి (Immunity) ని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవాలి. రాత్రి భోజనం కూడా చాలా త్వరగా చేసేయాలి. చలికాలంలో బెల్లం టీ త్రాగడం వలన బరువు తగ్గడంతో పాటు, కొన్ని రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బెల్లం టీ త్రాగడం వల్ల ఇంకా ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది :

శీతాకాలంలో క్రమం తప్పకుండా బెల్లం టీ (Jaggery tea) త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీంతో గ్యాస్, మలబద్ధకం, అజీర్తి (indigestion) వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఇమ్యూనిటీ పెరుగుదల :

బెల్లం లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. బెల్లం టీ మరియు మరియు బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం బలంగా మారుతుంది. ఇతర వ్యాధులతో పోరాడే శక్తి (fighting power) అధికంగా ఉంటుంది.

Health Tips : Ginger tea is a miracle cure for reducing body weight along with chronic health problems
Image Credit : Samayam Telugu

బరువు నియంత్రణ :

చలికాలంలో బరువు పెరిగే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ కాలంలో బరువు (weight) తగ్గాలి అనుకునే వారు క్రమం తప్పకుండా బెల్లం టీ త్రాగడం వలన శరీరంలో ఉన్న క్యాలరీలను తగ్గిస్తుంది. కాబట్టి బరువును నియంత్రణలో ఉంచాలి అనుకున్న వారు క్రమం తప్పకుండా బెల్లం టీ త్రాగవచ్చు.

పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది :

ఏ సీజన్ లో అయినా క్రమం తప్పకుండా మహిళలు బెల్లం టీ త్రాగడం వల్ల శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అందుతాయి. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే నెలసరి నొప్పి (Menstrual pain) సమస్య తో బాధపడేవారు బెల్లం టీ త్రాగడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

Also Read : Health Tips : శరీర బరువును తగ్గించి, ఉల్లాసంగా ఉంచే ఈ ఆహార పదార్ధాలను మీ డైట్ లో చేర్చుకోండి.. నిశ్చింతగా జీవించండి

కాబట్టి బెల్లం టీ లో శరీరానికి అవసరమయ్యే పోషకాలు (Nutrients) ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం టీ తాగడం వలన మంచి ఆరోగ్య ప్రయోజనాలు (Good health benefits) ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా బెల్లం టీ ను త్రాగడం అలవాటు చేసుకోవాలి.

Comments are closed.