Health Tips : సింఘాడ (Water Chest Nuts) ఎప్పుడైనా తిన్నారా? ఇవి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు.

వాటర్ చెస్ట్ నట్స్ వీటిని చాలామంది సింఘాడ అని కూడా పిలుస్తారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో కూడా సులభంగానే లభిస్తున్నాయి. సింఘాడ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటర్ చెస్ట్ నట్స్ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

వాటర్ చెస్ట్ నట్స్ (Water Chest Nuts) వీటిని చాలామంది సింఘాడ అని కూడా పిలుస్తారు. ఇవి శీతాకాలంలో విరివిగా లభిస్తాయి. ఇవి ప్రస్తుతం మార్కెట్లో కూడా సులభంగానే లభిస్తున్నాయి.

ఇవి డ్రై నట్స్ రూపంలో ఎక్కువగా లభిస్తున్నాయి. ఇవి తినడానికి చాలా రుచిగా కూడా ఉంటాయి. పేరుకు తగిన విధంగానే వీటిల్లో నీరు పుష్కలంగా ఉండడం వలన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి.

Also Read : Benefits Of Pistachio Nut : వారెవ్వా ! ‘పిస్తా’.. మగతనానికి, మంచి ఆరోగ్యానికి ‘పిస్తా పప్పు’ చేసే మేలు మామూలుగా లేదు.

సింఘాడ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ -A, మరియు C, మాంగనీస్ వంటి అనేక రకాల పోషకాలు (Nutrients) ఉండడం వలన శరీరానికి అనేక రకాలుగా మేలు కలుగజేస్తాయి.

వాటర్ చెస్ట్ నట్స్ తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

విటమిన్ -C, B6, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్, కాపర్ వంటి పోషకాలు వాటర్ చెస్ట్ నట్స్ లో పుష్కలంగా ఉన్నాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో అధిక మొత్తంలో ఫైబర్ ఉండడం వలన జీర్ణ క్రియ (Digestion) మెరుగ్గా పనిచేయడంలో చాలా బాగా పనిచేస్తాయి.

Health Tips : Have you ever eaten Singhada (Water Chest Nuts)? If you know the benefits of eating these, you will not leave them at all.
Image Credit : Pintrest

చలికాలంలో (Winter) వీటిని తినడం వల్ల మందగించిన ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తాయి. ఇవి మలబద్ధక (Constipation) సమస్యను కూడా నివారిస్తాయి. వీటిలో ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి.

వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం మరియు కాల్షియం ఉండటం వలన ఎముకల (Bones) ను మరియు దంతాలను బలంగా చేయడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి.

ఇవి బీపీ (BP) ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి గుండె జబ్బుల (Heart disease) ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

వాటర్ చెస్ట్ నట్స్ ను తినడం వల్ల జుట్టుకు బలాన్ని ఇస్తాయి. ఎందుకంటే వీటిలో ఉండే బారిక్ యాసిడ్ మూలాల నుండి జుట్టును బలంగా చేస్తుంది. తద్వారా జుట్టు పెరుగుతుంది.

వాటర్ చెస్ట్ నట్స్ లో జింక్, విటమిన్ బి, విటమిన్ ఇ, పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు (Hair) మరియు చర్మ సమస్యలను (Skin Problems) తగ్గిస్తాయి. ఇవి శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించి మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలను కూడా బలపరుస్తాయి. శీతాకాలంలో చాలామంది నీటిని తక్కువగా త్రాగుతారు. అయితే వీటిలో నీరు

పుష్కలంగా ఉంటుంది.ఇవి శరీరాన్ని డీ – హైడ్రేషన్ అవ్వకుండా కాపాడతాయి. వీటిని తిన్న తర్వాత చాలా సేపు ఆకలి అనిపించదు. కడుపు నిండిన భావన ఉంటుంది. బరువు తగ్గాలి (weight Lose) అనుకునే వారికి ఇవి బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు.

వీటిలో క్యాలరీలు మరియు కొవ్వు (Fat)  చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఫిట్ నెస్ కు చాలా బాగా దోహదపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని నిస్సంకోచం గా ఆహారంలో చేర్చుకోవచ్చు.

Also Read : Health Tips : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు శరీర బరువును తగ్గించే దివ్యౌషదం బెల్లం టీ

మధుమేహ వ్యాధిగ్రస్తులు వాటర్ చెస్ట్ నట్స్ తినడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకనగా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. తద్వారా మధుమేహం (diabetes) అదుపులో ఉంటుంది.

కాబట్టి చలికాలంలో లభించే వాటర్ చెస్ట్ నట్స్ తినడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వీటిని ప్రతి ఒక్కరూ నిస్సందేహం (Undoubtedly) గా తినవచ్చు.

Comments are closed.