conjunctivitis: వానాకాలం లో కండ్ల ‘కలక’లం. Dr .చింతా ప్రభాకర్ గారు చెప్పే జాగ్రత్తలతో మటు మాయం.

Telugu Mirror: కండ్ల కలక అనే మద్రాస్ ఐ

నీ కళ్ళు ఎర్రగా మారి, నీరు కారుతూ, దురద పెట్టినట్లు, పుసులు కట్టినట్లు ఉన్నాయా? అయితే మీకు కళ్ళకలక వచ్చేసింది.. ఇది ఈ వర్షాకాలం సీజన్లో కామన్ గా వస్తది.. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలామంది దీంతో ఎఫెక్ట్ అవుతున్నారు.. సౌత్ ఇండియా అంతా ఉంది..

వైద్య పరిభాషలో కంజెంటివెయిటిస్(conjunctivitis)అని అంటారు.. మన కంటిలో ఉన్న తెల్ల గుడ్డు మరియు రెప్ప కింద ఉన్న తెల్ల పొరలో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది.. కొందరికి ఇది తొందరగా అదంతకదే తగ్గిపోయినా. కొందరికి చాలా సమస్య గా అవుతాది.. కళ్ళంతా వాచిపోతాయి.. ఎర్రబడిపోతాయి.. కొందరికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి చీము కూడా పడతాది..

దీనికి ఎటువంటి పరీక్షల అవసరం ఉండదు.. దీనిని ఎవరైనా చూస్తానే చెప్పొచ్చు.. ల్యాబ్ టెస్టులు(Lab Tests) అవసరం లేదు.. ఇక మనం చేయాల్సిందంతా జాగ్రత్తగా ఉండడమే.

దీనికి ఇప్పుడు సిప్రోఫ్లాక్స్ (ciprofloxacin)కంటి చుక్కలు.. సెట్రిజిన్ టాబ్లెట్లు వేసుకోవడమే.. ఎక్కువ నొప్పి మంటగా ఉంటే.. కంటి పైన గోరువెచ్చని వేడి గుడ్డతో అలా అద్దుకుంటూ ఉండటం.. హాట్ ఫేమెంటేషన్ అని అంటారు.. ఒకవేళ ఎక్కువ పుసులు వచ్చి పచ్చగా కారుతూ ఉంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (bacterial infection)కి దారితీసి ఉంటుంది.. మన కంటి దగ్గర క్రస్టు ఫారం కూడా అవుతుంది..అప్పుడు యాంటీబయాటిక్సు డాక్టర్ ను సంప్రదించి వేసుకోవాల్సిందే..

ఇది కంటి చూపు వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి కాదు.. కానీ ఆ సెక్రెషన్సు వలన కంటేజియస్ గా మారుతుంది.. ఎవరి రుమాలు,టవల్ వారు ఎవరికి వారు జాగ్రత్తగా వాడుకోవాలి.. వీలైతే ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి.. శానిటైజర్(sanitizer)తో  చేతులు శుభ్రం చేసుకోవడం కూడా చాలా మంచిది..లేకపోతే ఇంట్లో అందరికీ అది అంటుకుంటుంది.. ఎవరికైనా వచ్చి ఉంటే ఆ కళ్ళని తుడుచుకొని దానిని ఏదైనా పుస్తకాలను లేదా డోర్ హ్యాండిల్స్ పట్టుకొని ఉంటే అది పట్టుకున్న మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతుంది..

కావున మనమంతా జాగ్రత్తగా ఉంటే ఈ ఈ కంటి ఇన్ఫెక్షన్ నుంచి కన్జెంటివిటీస్ బారిన పడకుండా ఉంటాము.. వీలైతే అందరూ కళ్ళజోడు ధరించడం చాలా మంచిది..

ఈ సమాచారాన్ని అందించినవారు

Dr.Chintha Prabhakar Reddy

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి(Dr.Chintha Prabhakar Reddy)MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, డిప్యూటీ సూపరింటెండెంట్,

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

YSR హెల్త్ యూనివర్సిటీ అకాడమిక్ సెనేట్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ మరియు పారామెడికల్ బోర్డు మెంబర్..

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ మెంబర్..

Leave A Reply

Your email address will not be published.