Rainy Season Remedies: వర్షాకాలం లో హోమ్ రెమిడీస్ ఇస్తాయి మీకు బిగ్ రిలీఫ్.

Telugu Mirror: వర్షాకాలంలో అంటువ్యాధులు రావడం చాలా సాధారణ విషయం. తేమతో కూడిన వాతావరణం కారణంగా వైరస్(Virus) ,బ్యాక్టీరియా(Bacteria)అధికం అవుతాయి. దీనివలన ఫ్లూ(Flu), చర్మ సమస్యలు మరియు కడుపులో ఇన్ఫెక్షన్స్(infections)దీంతో పాటు కండ్ల కలక ఈ కాలంలో గణనీయంగా పెరుగుతాయి.

వాతావరణంలో ఉండే మార్పుల వలన గొంతు ఇన్ఫెక్షన్ మరియు జలుబు, దగ్గు ఈ కాలంలో ఎక్కువగా బాధిస్తాయి. గాలిలో ఉండే అధికమైన తేమ కారణంగా అలర్జీలు కూడా గొంతు సమస్యలను తీసుకొస్తాయి . తేమవాతావరణం వల్ల బ్యాక్టీరియా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇది అంటువ్యాధుల సమస్యలను ఎక్కువ చేస్తుంది.

అయితే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడి తగ్గించుకుంటారు. గొంతు సమస్యలు మరియు నొప్పి నుండి రిలీఫ్ పొందడానికి కొన్ని ఇంటి చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

గొంతు ఇన్ఫెక్షన్(infection)వచ్చినప్పుడు నొప్పి లేదా మంట ప్రారంభమవుతుంది. దీని వలన మింగడం ఇబ్బంది అవుతుంది. మనం ఈరోజు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మందులు వాడకుండా ఇంటి నివారణలు పాటించడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్స్ మరియు నొప్పి నుండి బయటపడవచ్చు.

Also Read:Inguva Benefits: ఆహారంలోకే కాదు..ఇంగువ..అతివల అందానికి కూడా..”ఇంగువ”ను వాడండి ఇలా..మెరిసి పొండి మిల మిలా..

image credit:Jagran English

గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వేడి పానీయాలు సేవించడం ద్వారా ఉపశమనం కలుగుతుంది వీటివలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే తేనె తీసుకోవడం వల్ల కూడా చాలా బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. ఒకటి లేదా రెండు టీ స్పూన్ల(tea spoons) తేనె తీసుకోవడం వల్ల కఫం తగ్గిపోతుంది‌ తేనె క్రిములను నాశనం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది.

గొంతులో నొప్పి మరియు వాపు ఉన్నట్లయితే అల్లం తీసుకోవడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల శొంఠి పొడి లేదా రెండు అంగుళాల అల్లం ముక్కను దంచి నీళ్లలో వేసి బాగా మరిగించాలి, తర్వాత దీన్ని వడకట్టుకొని త్రాగడం వలన చాలా బాగా పనిచేస్తుంది. ఈ అల్లం టీ త్రాగటం వల్ల గొంతు సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దీంతో పాటు చిన్న అల్లం ముక్కను నోట్లో ఉంచుకొని ఆ రసాన్ని మింగటం వల్ల కూడా ఉపశమనం కలుగుతుంది.

Also Read:Sugar Patients: మధుమేహ బాధితులు పండ్లు తిన్నా ప్రమాదమే..ఈ పండ్లు తింటే ఏమవుతుందో  తెలుసా ?

గొంతు నొప్పి మరియు వాపు ఉన్నప్పుడు ఉప్పునీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇవి నోటిలో ఉన్న బ్యాక్టీరియా(bacteria)ని చంపుతుంది. నోటి సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్స్ మరియు ఫ్లూ వచ్చినప్పుడు వేడి నీళ్లలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

కాబట్టి ఈ చిట్కాలను అనుసరించి వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు మరియు గొంతు సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

Leave A Reply

Your email address will not be published.