Sesame Seeds Benefits : శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందించే నువ్వులు

నువ్వులు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేయడంలో సహాయపడతాయి. నువ్వుల వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. నువ్వులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నువ్వులు ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేయడంలో సహాయపడతాయి. నువ్వుల వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధుల ప్రమాదాల నుండి మనల్ని రక్షిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. మనదేశంలో మకర సంక్రాంతి పండుగ రోజున నువ్వులు మరియు బెల్లం ను కూడా దానం చేస్తారు.

చలికాలం (winter) లో శరీరానికి అంతర్గతంగా వేడిని అందించడానికి నువ్వులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే చలికాలంలో నువ్వులు మరియు బెల్లం తో చేసే లడ్డూలను తినే సంప్రదాయం కూడా ఉంది. నువ్వులను  తినడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

నువ్వులను వేలాది సంవత్సరాల నుండి వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. గుండె జబ్బులు,ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో నువ్వులు ఎంతగానో సహాయపడతాయి. జీర్ణ వ్యవస్థ (digestive system) ఆరోగ్యంగా ఉండడానికి నువ్వులు చాలా బాగా పనిచేస్తాయని పరిశోధనలో కనుగొనబడింది.

నువ్వులలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కనుక నువ్వులు (Sesame seeds) ఫైబర్ యొక్క మూలంగా పరిగణించబడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల నువ్వుల నుండి అనగా సుమారు 30 గ్రాముల నువ్వులలో 3.5 గ్రాముల ఫైబర్ ను సులభంగా శరీరానికి అందించవచ్చు. నువ్వులను ప్రతిరోజు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

Also Read : నల్ల నువ్వుల్లో అధిక పోషకాలు, ఆహారంలో చేర్చుకోండి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి

ఊబకాయం టైప్ -2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వంటి ప్రమాదాల నుండి మనల్ని కాపాడడంలో ఫైబర్ చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి గుండె జబ్బులకు ప్రధాన మరియు ప్రమాద కారకాలు.

నువ్వుల లో 15% సంతృప్త కొవ్వు, 41% బహుళ అసంతృప్తి కొవ్వు, మరియు 39% మోనో శాచురేటడ్ కొవ్వులు ఉన్నాయి. పాలీ అన్ శాచురేటెడ్ మరియు మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లను తగ్గిస్తాయి. తద్వారా గుండె జబ్బులను నివారిస్తాయని అధ్యయనాలు పేర్కొన్నాయి.

Sesame Seeds Benefits : Sesame seeds provide many health benefits to the body
image credit : Andrajyothy

రక్తంలో గ్లూకోస్ స్థాయిని తగ్గించి మధుమేహం ఉన్న వారిలో ఇతర సమస్యలు రాకుండా కాపాడడంలో నువ్వులు చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని కనుగొనబడింది.

నువ్వులలో ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్నాయి. నువ్వులలో పిండి పదార్థాలు తక్కువగా ఉన్నాయి. కనుక మధుమేహం ఉన్నవారు నువ్వులు తినడం వలన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొన్ని అధ్యయనాలు ప్రకారం తెల్ల నువ్వులలో ఫినో రెసినాల్ అనే సమ్మేళనం ఉంది. ఇది జీర్ణ ఎంజైమ్ మాల్టోజ్ యొక్క చర్యను నిరోధిస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర (Sugar) స్థాయి నియంత్రించడంలో తోడ్పడుతుంది.

Also Read : Dates Benefits : పోషకాల గని ఖర్జూర పండు. రోజూ రాత్రి రెండు ఖర్జూర మిమ్మల్ని ఎప్పటికీ ధృఢంగా ఉంచుతుంది.

రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో నువ్వులు చాలా బాగా పనిచేస్తాయి. నువ్వులలో సెలీనియం, విటమిన్ బి 6, కాపర్, జింక్, ఐరన్ మరియు విటమిన్ ఇ ఉన్నాయి. ఈ పోషకాలు నువ్వులలో ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వీటిలో జింక్ ఉండడం వల్ల తెల్ల రక్త కణాలను (White blood cells)పెంచి తద్వారా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బలమైన రోగ నిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల అంటువ్యాధులు (Infections) వచ్చినప్పుడు వాటి నుండి సులభంగా మనల్ని రక్షిస్తాయి.

కాబట్టి నువ్వులు వినియోగం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు ఆహారంలో నువ్వులను భాగంగా చేర్చుకోవాలి.

Comments are closed.