Honor Pad X9:ఆరు స్పీకర్ వంటి మరెనో సూపర్ ఫీచర్స్ తో అదిరిపోయే గాడ్జెట్

ఈరోజు Honor Pad X9 భారత దేశంలో విడుదల అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదల అయిన Honor Pad X8 తో పోలిస్తే Honor Pad X9 లో అప్ గ్రేడెడ్ ఫీచర్ లతో కంపెనీ తీసుకొచ్చింది. Honor Pad X8 10.1- inch full HD IPS డిస్ ప్లే తో వచ్చింది. MediaTek Helio G80 SoC చిప్ సెట్ తో వచ్చింది, అలానే 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. Honor Pad X9 లో ఎన్నో మార్పులను తీసుకొచ్చారు.

Honor Pad X9 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 11.5- inch TFT LCD డిస్ ప్లే తో విడుదల అయ్యింది. అలానే 2000 x 1200 రెజల్యూషన్ ను కలిగి ఉంది. 1.07 బిలియన్ కలర్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్ కేవలం స్పేస్ గ్రే కలర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. 2nits నుంచి 400nits వరకు బ్రైట్ నెస్ ను సపోర్ట్ చేస్తుంది.

Also Read:iQOO Z7 Pro : అదిరిపోయే ఫీచర్స్, వారేవా స్పెసిఫికేషన్స్ తో ఆహా అనిపించనున్న iQOO Z7 Pro..

Honor Pad X9 4GB RAM మరియు 128GB స్టోరేజ్ మోడల్ తో విడుదల అయ్యింది. ఈ హ్యాండ్ సెట్ Qualcomm Snapdragon 685 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. అలానే ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 13 మరియు Magic OS 7.1 తో నడుస్తుంది. ఇది 4G నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది.

Honor Pad X9 కేవలం ఒక్క రియర్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. ఈ హ్యాండ్ సెట్ 5- మెగా పిక్సెల్ రియర్ కెమెరా మరియు 5- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో వచ్చింది. టైమ్డ్ ఫోటోగ్రఫీ, టైమ్ లాప్స్ ఫోటోగ్రఫీ, HDR వంటి కాప్చరింగ్ మోడ్ లను కలిగి ఉంది. అలానే ఈ హ్యాండ్ సెట్ 7250mAh లిథియం పాలిమర్ బ్యాటరీ తో వచ్చింది. 22W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 గంటల వరకు ఈ డివైజ్ ను వాడవచ్చు. ఈ హ్యాండ్ సెట్ Type C ఛార్జర్ ను సపోర్ట్ చేస్తుంది.

ఈ హ్యాండ్ సెట్ ఆరు స్పీకర్ లను కలిగి ఉంది. అలానే వీడియోలో ఉన్న మనిషి యొక్క వాయిస్ ను ఇంకా క్లియర్ గా వినిపించేలా చేస్తుంది.

Also Read:Real me pad 2: మార్కెట్లో కి రియల్ మీ ప్యాడ్ 2 డిస్కౌంట్ పొందే అవకాశం మీ కోసం

Image Credit:94 mobiles

Honor Pad X9 WiFi 5, Bluetooth 5.1 వంటి కనెక్టివిటీ లను కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ 267.3mm x 167.4mm x 6.9mm డైమెన్షన్స్ మరియు 499 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ట్యాబ్లెట్ యొక్క అమ్మకాలు ఇంకా మొదలవ్వలేదు, ప్రస్తుతం ప్రీ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ప్రీ ఆర్డర్ ద్వారా రూ.500 డిస్కౌంట్ మరియు ట్యాబ్ యొక్క స్క్రీన్ కవర్ ను పొందవచ్చు. ఈ ట్యాబ్లెట్ ను Honor యొక్క అధికారిక వెబ్ సైట్ లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఆగస్ట్ 2 నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

Leave A Reply

Your email address will not be published.