Type – 2 Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే కాలేయం ఆరోగ్యం గా ఉండాలి..కాలేయాన్ని కాపాడండి ఇలా

Telugu Mirror: మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రక్తంలో గ్లూకోజ్(Glucose)అధికం అవ్వడం వలన దాని యొక్క ప్రభావం శరీరం మొత్తం పై పడుతుంది. డయాబెటిస్ ఉన్న కారణం వల్ల గుండె(Heart), మూత్రపిండాలు(Kidneys), కళ్ళు మరియు నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్(Diabetes)ఉంటే ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయో వారికి తెలియజేయాలని దాని గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

రక్తంలో గ్లూకోజ్(Glucose)ను నియంత్రించడానికి అలాగే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని డయాబెటిస్ వైద్యులు చెబుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉంటే రక్తంలో చక్కెరని నియంత్రించవచ్చని వైద్యులు అంటున్నారు.

రక్తంలో చక్కెరను తగ్గించాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడానికి తోడ్పడుతుంది. టైప్ – 2మధుమేహం(Type – 2 Diabetes)ఉన్నవారికి కొవ్వు కాలేయము (ఫ్యాటీ లివర్) వచ్చే సమస్య అధికంగా ఉంటుంది. దీని వలన వారి యొక్క రక్తంలో చక్కెర నియంత్రించడానికి మరియు బరువు తగ్గడానికి ఇబ్బంది కలిగిస్తుంది. అందువలన కాలేయం యొక్క పనితీరు సక్రమంగా ఉన్నట్లయితే అది రక్తంలో ఇన్సులిన్(insulin) మరియు చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

Image credit: Harvard Health

Also Read: Organic Turmeric Powder Face Pack: ఆర్గానిక్ పసుపు ఉండగా మీ చెంత..పార్లర్ కి ఎందుకు డబ్బులు దండుగ.. మెరిసే చర్మం కోసం టర్మరిక్

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ ప్రమాదాన్ని సమర్థవంతంగా నిర్మూలించడంలో ఉపయోగపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. గోధుమ గడ్డి ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ను కలిగి ఉంటుంది. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది మరియు రక్తంలో గ్లూకోజ్ సమస్యలను కూడా నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వీటికే కాకుండా గోధుమ గడ్డి రసం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఉపయోగాలు ఇంకా ఉన్నాయి.

కాలేయంను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. వీటిని అనుసరించడం ద్వారా కాలేయం యొక్క ఆరోగ్యంతో పాటు షుగర్ సమస్యను నియంత్రించవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం:

1. ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని తీసుకోవాలి.

2. క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి .

3.రోజువారి ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు , పాల సంభంధిత ఉత్పత్తులు మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.

4. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇది కాలేయం మరియు రక్తంలో చక్కెరను , రెండిటికి ఉపయోగపడుతుంది.

5. మద్యం, డ్రగ్స్ , ధూమపానం ఇటువంటి అలవాట్లు ఉంటే పూర్తిగా మానేయాలి.

6. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పండ్లు(Fruits), కూరగాయల(Vegetables)రసాన్ని తీసుకోవడం వల్ల మీకు ప్రత్యేకమైన ఫలితాలను చేకూరుస్తుంది.

కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచవచ్చు‌. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

Leave A Reply

Your email address will not be published.