Mothers Love: అమ్మా నీకు వందనం.. వైరల్ గా మారిన తల్లి ప్రేమ

కనిపించే దైవం అమ్మ(Amma)..ప్రేమకి చిరునామా అమ్మ..త్యాగానికి నిలువెత్తు రూపం అమ్మ..

సృష్టికి మూలం అమ్మ..అమ్మ లేనిదే జీవితం లేదు.ఇలా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..వర్ణించలేనిది అమ్మ ప్రేమ అలాంటి అమ్మ ప్రేమ గురించి చెప్పాలంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాల సమయం కూడా సరిపోదు. తాజాగా వెలుగు చూసిన ఓ సంఘటన మరొక్కసారి తల్లి ప్రేమని ప్రపంచానికి తెలియ జెప్పింది. పసి బిడ్డను ఒడిలో పెట్టుకుని ఈ-రిక్షా నడుపుతున్న మహిళ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అమ్మ ప్రేమ కి సాటి ఏదీ లేదు. తన పిల్లల శ్రేయస్సు కోసం తల్లులు ఏమైనా చేయగలరు. అమ్మ ని నిజమైన హీరోగా చూపించే ఉదాహరణలు మనం తరచూ వింటుంటాం, కధలలో,సినిమాలలో,ఇంటర్నెట్ లలో చూస్తుంటాము. అయితే ఇటీవల అమ్మని హీరో గా చూపించే ఒక ఎమోషనల్ వీడియో అంతర్జాలంలో చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న భావోద్వేగ వీడియోలో మహిళ పిల్లలతో ఈ-రిక్షా నడుపుతున్నట్లు కనిపిస్తుంది.

వైరల్ అవుతున్న వీడియో తెరవగానే ఉన్న మహిళ తన బిడ్డను ఒడిలో జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ప్రయాణీకులతో మాట్లాడుతూ కనిపిస్తుంది.పసిబిడ్డను తన చేతులలోకి తీసుకుంటూ మహిళ ఈ-రిక్షాను సురక్షితంగా నడుపుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.

వైరల్ భయానీ అనే నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. చిన్నారితో కలసి ఈ-రిక్షా నడుపుతున్న మహిళ ను చూసి పలువురు తమ అభిమానాన్ని ఆ మహిళ పై ప్రదర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైరల్ గా మారిన ఈ వీడియో ఇప్పటికే సుమారు 2లక్షల50 వేలకు పైగా నెటిజన్లు ఇష్ట పడ్డారు. ఈ వీడియో కి స్పందనగా “అక్కడ ఉన్న అమ్మలు అందరికీ సెల్యూట్ ” అని “లేడీకి హ్యాట్సాఫ్” అంటూ అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు చూసినవారు.

వైరల్ గా మారిన వీడియోని ఈ లింక్ ద్వారా చూడండి.

https://www.instagram.com/reel/CuV2Hp7KhgN/?igshid=NjZiM2M3MzIxNA==

Leave A Reply

Your email address will not be published.