Jailer Movie : ఆగష్టు 10 న రజనీ సునామి ‘జైలర్’ సినిమా విడుదల..చైన్నై,బెంగళూరులో ఆఫీసులకు సెలవు.

Telugu Mirror : సూపర్ స్టార్ రజనీకాంత్(SuperStar Rajinikanth) హీరో గా నటించిన జైలర్ చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది.ఈ చిత్రం విడుదల రోజున ఆఫీసులకు సెలవు ప్రకటించడంతో జైలర్ తమిళ సినిమాపై బజ్ ఆల్ టైమ్ హైకి చేరింది.రెండు సంవత్సరాల తరువాత రజనీకాంత్ నటించిన మొదటి సినిమాగా జైలర్(Jailer) పూర్తి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు హామీ ఇచ్చాయి.

రజనీకాంత్‌ను మళ్లీ తెరపై చూడాలని అభిమానులు సిద్ధమవుతున్న సమయంలో,జైలర్ చిత్రం విడుదల రోజున చెన్నై మరియు బెంగళూరులోని కార్యాలయాలు తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించాయని ది ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. అంతే కాకుండా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ సినిమా టిక్కెట్లను ఉచితంగా కూడా అందజేశాయి. నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) దర్శకత్వంలో, రజనీకాంత్  నటించిన జైలర్ ఆగస్ట్ 10న థియేటర్లలోకి వస్తుంది.

Also Read : Actor Tarun: మెగా ఫ్యామిలీతో తరుణ్ పెళ్లి ప్రచారం..అసలు నిజమేంటో మీకు తెలుసా?

ఈ చిత్రం గురువారం రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో భారీ విడుదలకు సిద్దమవుతుంది. జైలర్ చిత్రం రిలీజ్(Release) కు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. అలాగే అభిమానులలో కోలాహలం కనిపిస్తుంది, జైలర్ విడుదల కోసం కౌంట్‌డౌన్‌లను షురూ చేయడానికి విపరీతంగా చాలా మంది అభిమానులు సోషల్ మీడియాను ఆశ్రయించారు.సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్ బాక్స్ ఆఫీస్(Box Office) వద్ద భారీ అంచనాల మధ్య విడుదల అవుతుంటే అకౌంట్‌పై కంపెనీలు సెలవు ప్రకటించడం వైరల్ అవుతోంది.

Image Credit : Movie Crow

హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌(HR Department)కు వచ్చే సెలవు రిక్వెస్ట్ లను నివారించడానికి ఆగస్టు 10న సెలవు ప్రకటించినట్లు కంపెనీలు తమ నోటీసులో పేర్కొన్నాయి. “ఉద్యోగులకు ఉచిత టిక్కెట్లను అందించడం ద్వారా యాంటీపైరసీని అరికట్టటానికి మద్దతు ఇవ్వడం ద్వారా మేము ఒక అడుగు ముందుకు వేసేందుకు అధికారాన్ని తీసుకుంటాము…” అని నోటీసులో పేర్కొంది.ఈ చిత్రం రజనీకాంత్ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి బిగ్ స్క్రీన్ మీద కనిపించడం అలాగే రిటైర్డ్ పోలీసు అధికారి పాత్రలో నటించడం. నెల్సన్ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో మొదటిసారి రజనీకాంత్ నటించిన చిత్రం జైలర్. దీనికి తన పూర్తి సహకారాన్ని అందించాడు సూపర్ స్టార్.

Also Read : Tollywood Actors Died In Small Age:చిన్న వయసులోనే మృత్యు ఒడిలో చేరిన తారలు వీరే.

రజనీకాంత్ కొత్త చిత్రం జైలర్ అధికారిక ట్రైలర్(Trailer) ను ఈ నెల మొదటిలో జైలర్ షోకేస్ పేరుతో విడుదల చేశారు. జాకీ ష్రాఫ్ ఫోన్ కాల్ ద్వారా రజనీకాంత్‌ను బెదిరించే సన్నివేశం కూడా సినిమాపై అంచనాలను పెంచాయి. జైలర్‌లో ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్, తమన్నా భాటియా , రమ్య కృష్ణన్, యోగి బాబు, వసంత్ రవి, వినాయకన్ మొదలగు వారు నటించారు.

ప్రముఖ మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్‌(Moham Lal)ను ఈ చిత్రంలో కొంత మేర పొడిగించిన అతిధి పాత్ర కోసం చిత్ర నిర్మాత లు ఎంచుకున్నారు. ఈ చిత్రం మేకర్స్ ఆగష్టు 5న , ట్విట్టర్ (లేదా X) లో ఒకే ఫ్రేమ్ లో రజనీకాంత్ మరియు మోహన్‌లాల్ కలిసి ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక సోఫాలో కూర్చుని వారిద్దరూ మాట్లాడు కోవడం చూడవచ్చు. పోస్టర్‌ను ఉటంకిస్తూ, సన్ పిక్చర్స్ వారు ఇలా రాశారు, “థియేటర్లలో జైలర్ తుఫాను కోసం 5 రోజులు గడవాలి! ఆగస్ట్ 10 నుండి జైలర్.”

Leave A Reply

Your email address will not be published.