Vaastu Tips : మనీ పర్స్ ఇలా ఉంటే మహాలక్ష్మి మీ వెంటే

చాలా మందికి పర్స్ వాడే అలవాటు ఉంటుంది. పర్సులో డబ్బులు పెడుతుంటాం. అంటే లక్ష్మీదేవి పర్సులో నివాసం ఉంటుందని అర్థం. ఏ వస్తువులు పడితే ఆ వస్తువులను పర్స్ లో పెట్టడం వలన అప్పులు అధికమవుతాయి. కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత రోజుల్లో డబ్బులకు సంబంధించిన లావాదేవీలు (transactions) అన్నీ ఆన్ లైన్ లోనే అయిపోతున్నాయి. అయినప్పటికీ చాలా మందికి పర్స్ వాడే అలవాటు ఉంటుంది. అయితే పర్స్ లో డబ్బులు,చిల్లర నాణేలు పెట్టడం సహజం. అయితే కొంతమంది మాత్రం డబ్బులతో పాటు బిల్లులు, ఫోటోలను కూడా పెడుతుంటారు.

వాస్తు ప్రకారం కొన్ని రకాల వస్తువులను పర్స్ లో పెట్టడం అసలు మంచిది కాదని వాస్తు పండితులు (Scholars) సూచిస్తున్నారు. ఎందుకంటే పర్స్ అనేది కేవలం డబ్బులను దాచుకోవడం మాత్రమే ఉపయోగించాలి. అలా కాకుండా పర్స్ లో ఏవి పడితే అవి పెట్టడం వలన కష్టాలు కొన్ని తెచ్చుకున్నట్లే.

పర్సులో డబ్బులు పెడుతుంటాం. అంటే లక్ష్మీదేవి పర్సులో నివాసం ఉంటుందని అర్థం. ఏ వస్తువులు (Things) పడితే ఆ వస్తువులను పర్స్ లో పెట్టడం వలన అప్పులు అధికమవుతాయి. కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈరోజు కధనం లో పర్సులో ఎటువంటి వస్తువులు పెట్టకూడదో తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా పర్సులో బిల్లులు ఉంచకూడదు. ఇవి ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి (Financial situation) మరింత దిగజారేలా చేస్తాయి. అనవసరమైన వస్తువులను, డబ్బులు దాచుకునే స్థలంలో లేదా పర్స్ లో ఉండడం వలన లక్ష్మీదేవికి అసంతృప్తి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి పాత బిల్లులు కూడా పనికిరాని వస్తువులతో సమానం‌. కాబట్టి పర్స్ లో అవి ఉంటే వెంటనే తీసివేయాలి.

Vaastu Tips : If money purse is like this then Mahalakshmi is following you
image credit : India TV News

జీవించి ఉన్నా లేదా చనిపోయిన వ్యక్తుల ఫోటోలు పర్సులో ఉంచుకూడదు. వాస్తు ప్రకారం పర్సులో దేవుడు ఫోటోలు కూడా ఉంచకూడదు. ఇటువంటి ఫోటోలు పర్సులో ఉండటం వలన అశుభమని (Inauspicious) నిపుణులు చెబుతున్నారు. ఫోటోలు పర్సులో ఉండటం వలన అప్పులు బాధలు కలుగుతాయని, లక్ష్మీదేవి నివసించే స్థానంలో ఇతరుల ఫోటోలు ఉండటం మంచిది కాదు అని వారు చెబుతున్నారు.

పర్సులో డబ్బులు ఎప్పుడూ చిందర వందర గా ఉండకూడదు.అంటే కాగితాలు(notes), నాణేలు (Coins) వేరువేరుగా ఉంచుకోవడం శ్రేయస్కరం. డబ్బులను క్రమ పద్ధతిలో ఉంచాలి.

Also Read : Vaastu Tips : ఏ దిక్కున ఏ రంగు డోర్ మ్యాట్ ఉంచితే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుంది? తెలుసుకోండి!

పర్సులో ఇంటి మరియు వాహనాల తాళాలను ఎప్పుడూ ఉంచకూడదు. పర్సులో తాళాలు (Locks) ఉండటం వలన పేదరికానికి దారితీస్తుంది. పొరపాటున కూడా పర్స్ లో తాళాలను ఉంచకండి. తాళాలు ఉండడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read : Vaastu Tips : ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం పొందండి

వాస్తు శాస్త్రం ప్రకారం చిరిగిన నోట్లు కూడా ఎప్పుడు పర్సులో ఉండకూడదు. పర్సులో చిరిగిన నోటు (A torn note) ఉంటే వెంటనే తీసేయాలి. అలాగే చిరిగిన పర్స్ ను కూడా ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం అప్పు (Debts) గా తీసుకున్న డబ్బులు కూడా పర్సులో ఎప్పుడూ ఉంచకూడదు. అప్పుగా తీసుకున్న డబ్బును పర్స్ లో ఉంచితే అప్పులు భారం పెరిగి ఆర్థికంగా నష్టపోతారు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు పర్సు విషయంలో ఇటువంటి పొరపాట్లు చేయకండి. నమ్మకం ఉన్నవారు పాటించండి. శుభ ఫలితాలను (Good results) పొందండి.

Comments are closed.