Best Investment Options : పిల్లల ఉన్నత చదువులకు డబ్బు పొదుపు చేయాలా? అయితే ఈ ప్లాన్స్ మీ కోసమే

పిల్లల చదువుకి డబ్బు పొదుపు చేయడం చాలా అవసరం. ట్యూషన్ ఫీజు, బుక్స్, హాస్టల్ ఫీజు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఈ మధ్య అన్ని ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. 

Telugu Mirror : ఏ తల్లిదండ్రులు అయిన తమ పిల్లలను మంచి స్థాయిలో చదివించాలనే అనుకుంటారు. ఈరోజుల్లో పిల్లల చదువు అంటే తల్లిదండ్రులకు సవాలుగా మారింది. పిల్లల చదువుకి డబ్బు పొదుపు చేయడం చాలా అవసరం. ట్యూషన్ ఫీజు, బుక్స్, హాస్టల్ ఫీజు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఈ మధ్య అన్ని ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి.

స్వదేశంలోనే విద్యకి ఇంత ఖర్చు అవుతుంటే ఇక విదేశాల చదువుల గురించి చెప్పలేము. అయితే, మరి మీ పిల్లల చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ డబ్బు ఎలా పొదుపు చేయాలని చూస్తున్నారా? దిగులు పడకండి. స్మార్ట్ ఫైనాన్సియల్ ప్లానింగ్ తో మీ పిల్లలకు మంచి విద్యను అందించవచ్చు.

చిన్నతనం నుంచే నాణ్యమైన విద్య అందిస్తే అనుకున్న స్థాయికి పిల్లలు చేరుకుంటారు. ప్రతి సంవత్సరం పిల్లల చదువులపై ఖర్చులు పెరుగుతున్నాయి. ఒక 10 ఏళ్ల కిందట ఒక కోర్స్ కోసం రూ.6 లక్షలు ఖర్చు అయితే అదే కోర్స్ పూర్తి చేయడానికి ఇప్పుడు దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

Best Investment Options : Saving money for children's higher education? But these plans are for you
Image Credit : The Economics Times Telugu

Also Read : 24వ త్రైమాసిక క్యూ3 (Q3FY24) లో అత్యధిక లాభాలను ఆర్జించిన యూనియన్, ఐడిబిఐ, ఐసిఐసిఐ మరియు ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ షేర్లు

ppf డబ్బు ఆదా చేయడానికి మరియు విద్యకి మంచి మార్గం అని చెప్పవచ్చు. చదువు కోసం పొదుపు చేయడానికి ppfలో ఫ్లెక్సిబిలిటీ, కాంపౌండ్ కలియిక మంచిగా ఉంటుంది. ఇలా సేవింగ్స్ చేసినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఆ డబ్బు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఎడ్యుకేషన్ లోన్లు మీకు సహాయపడతాయి. మంచి వడ్డీ రేట్లు, ఫ్లెక్సిబిల్ రీపెమెంట్ ఆప్షన్ ల కోసం కొన్ని బ్యాంకులను సంప్రదించడం మంచిది.

NSC ప్రిన్సిపుల్స్ అమౌంట్ కి ప్రొటెక్షన్ గా మరియు వడ్డీకి హామీ ఇస్తుంది. NSC సర్టిఫికెట్ ను లోన్ కి సెక్యూరిటీ గా ఉపయోగించవచ్చు.

ఉన్నత విద్య కోసం ఎఫ్డి లోన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవి సురక్షితమైనవి. ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటె సుకన్య సమృద్ధి యోజన ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఈ పథకం మీ కూతురు పెరిగే కొద్దీ డబ్బుని ఆదా చేస్తుంది. అదనంగా పన్ను పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.

సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల క్రమం తప్పకుండా కొంత డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే ఎక్కువ కాలం వరకు మంచి రాబడిని పొందవచ్చు.

Comments are closed.