Dosa Recipe : ఇనుప పెనం పై ఫటా ఫట్ దోసె చేసేయండి ఇలా..

Telugu Mirror : భారతదేశంలో, సౌత్ ఇండియన్ ఫుడ్(South Indian Food) ని అందరూ ఇష్టపడుతుంటారు. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు దక్షిణ భారతదేశంలో చేసే వంటలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి వంటలలో ఉదయం టిఫిన్(Tiffin) లోకి దోస తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది .దోస అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.హోటల్స్ నడిపే వాళ్ళు కూడా కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి రావడం కోసం రకరకాల పద్ధతుల్లో రుచికరంగా తయారు చేసి అమ్ముతుంటారు. హోటల్స్ లాగా రుచిగా దోసని మనం ఇంట్లోనే అదీ ఐరన్ ప్యాన్(IronPan) మీద ఎలా వేయాలో తెలుసుకుందాం.

Rainy-Season : వానాకాలం.. వ్యాధుల కాలం.. చెక్ పెట్టండి ఇలా..

అయితే ప్రస్తుత కాలంలో చాలామంది దోసలు నాన్ స్టిక్ పెనం(Non-Stick Pan) మీద వేస్తుంటారు. ఐరన్ పెనం మీద వేస్తే అవి అంటుకుంటాయని, సరిగా రావు అన్న ఉద్దేశంతో నాన్ స్టిక్ పాన్ ని వాడుతున్నారు.దోసను ఐరన్ ప్యాన్ మీద వేసినప్పుడు ఒక్కొక్కసారి అంటుకుంటుంటాయి అలా కాకుండా ఉండాలంటే మేము చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా దోసలు అంటుకోకుండా చక్కగా వస్తాయి. క్రింద సూచించిన పద్దతిలో దోసెలను ఇంట్లోనే అది కూడా ఐరన్ ప్యాన్ మీద వేసుకొని హాయిగా ఆరగించవచ్చు.

Image Credit : Food and Travel

దోసె(Dosa)లను ఐరన్ ప్యాన్ మీద వేసేటప్పుడు ప్యాన్ చాలా శుభ్రంగా కడగాలి. పెనం మీద నూనె తాలూకు జిడ్డు మరకలు, మురికి ఉంటే దోసలు సరిగ్గా రావు .కాబట్టి పెనం చాలా శుభ్రంగా ఉండాలి.దోస పెనం(Pan) కు అంటుకోకుండా రావాలంటే స్టవ్ పై ఉంచిన తర్వాత సగం కట్ చేసిన ఉల్లిపాయ లేదా బంగాళాదుంప ముక్కను ఆయిల్(Oil) లో ముంచి పెనంపై రుద్దడం వలన దోస పెనం కు అంటుకోకుండా వస్తుంది.దోస వేసిన ప్రతిసారి అంటుకుంటూ ఉంటే పెనం బాగా వేడి అయ్యాక, మరల చల్లగా అయ్యేవరకు ఉంచాలి. ఆ తర్వాత దోసెలు వేస్తే మరింత క్రిస్పీ(Crespy)గా వస్తుంది.

TS Weather : 3 రోజులు అతి భారీ వర్షాలు…! తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌

ఫ్రిజ్లో ఉన్న పిండితో దోసె వేయాలనుకుంటే పిండిని ఫ్రిజ్ లోనుంచి తీసిన వెంటనే వేయకూడదు. ఆ విధంగా వేస్తే సరిగా రావు. అలా జరగకుండా ఉండాలంటే ఫ్రిజ్ నుండి పిండిని తీసిన తర్వాత బయట కొంత సమయం ఉంచాలి. గది ఉష్ణోగ్రత(Room Temparature) కు వచ్చిన తర్వాత దోసెలు వేస్తే దోసెలు చక్కగా వస్తాయి. దోస వేయడానికి సిద్ధం చేసిన పిండిలో ఎక్కువ నీరు పోసి బాగా జారుగా చేయకూడదు .పిండిలో నీళ్లు ఎక్కువైతే దోస సరిగా రాదు, విరిగిపోతుంది. అవసరమైన మోతాదులో మాత్రమే వాటర్ పోసి పిండిని కలపాలి.ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ,ఐరన్ పాన్ మీద కూడా మృదువుగా, క్రిస్పీగా, రుచిగా ఉండే దోస(Dosa)ల ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.