Chandranna Bima Scheme : మరో పథకం పేరు మార్చిన ఏపీ సర్కార్, వారికి రూ.5 లక్షలు

వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..

Chandranna Bima Scheme : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మరో పథకానికి పేరును మార్చింది. వైఎస్ఆర్ బీమా పథకం (Chandranna Bima Scheme) పేరును చంద్రన్న బీమాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసంఘటిత రంగ కార్మికులు మరియు పేదలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ పథకం పారంభించడం జరిగింది.

ఈ బీమా పథకం కింద కుటుంబ పెద్దలు 18 నుంచి 50 ఏళ్ల మధ్య సహజంగా మరణిస్తే ప్రభుత్వం వారికి అలాగే కుటుంబ పెద్ద 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండి, ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా అంగవైకల్యం చెందినా ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందజేస్తుంది. అయితే ప్రభుత్వం బీమాను పెంచుతుందా.. లేక యథావిధిగా కొనసాగిస్తుందా అనేది చూడాలి.

మరోవైపు అమరావతి సచివాలయంలో (Amaravati Secretariat) కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్‌ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 5వ బ్లాక్‌లో వేద విద్యావేత్తలు ఆశీస్సుల మధ్య బాధ్యతలు స్వీకరించారు.కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తామని మంత్రి సుభాష్ అన్నారు.

Chandranna Bima Scheme

కార్మిక శాఖలో కార్మికునిగా పనిచేస్తానని, వారి హక్కులను కాపాడుతూ వారి సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఐదేళ్లలో కార్మిక నియమాలు ఉల్లఘించారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు 1% సెస్‌ను దొంగిలించిందని ఆయన పేర్కొన్నారు.

కేంద్రం అమలు చేస్తున్న 22 కార్యక్రమాలు, నాలుగు రాష్ట్రాల చట్టాలతో పాటు కార్మిక హక్కులు, చట్టాలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. గతంలో తెలుగుదేశం పాలనలో కార్మికులకు బీమా సౌకర్యం కల్పించిందన్నారు. సుభాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.

13 కార్యక్రమాలను రద్దు చేయడం వల్ల కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తనకు మంత్రి అవకాశం కల్పించారని పేర్కొన్నారు.

Chandranna Bima Scheme

Also Read : QR Code : షాపుల్లో క్యూఆర్ కోడ్ పెట్టి బిజినెస్ చేస్తున్నారా? ఈ కొత్త నోటీసు మీ కోసమే!

Comments are closed.