PM Kisan Yojana : అన్నదాతలకు గుడ్ న్యూస్..ఖాతాల్లోకి డబ్బులు..14వ విడతపై బిగ్ అప్డేట్..

Telugu Mirror : ప్రధాన మంత్రి కిసాన్ యోజన (PMKSY ) పధకంలో భాగంగా రైతులకు నగదు సాయం త్వరలో విడుదల కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ సంక్షేమ పధకాలను చేపడుతుంది. ఈ పధకాలు ఆర్ధికంగా వెనుకబడిన పేద,మధ్యతరగతి వారికి ఉపయోగకరంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించే సంక్షేమ పథకాలలో ఉచిత రేషన్ పధకం అలాగే గృహ నిర్మాణ మరియు భీమా,పెన్షన్(Pension) తదితరాలు ఉన్నాయి.

Curd Face Pack : పెరుగు తో అద్దిరిపోయే ముఖ సౌందర్యం ఇప్పుడు మీ సొంతం..

అదేవిధంగా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకమే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను( PMKSY ) ను అమలు చేస్తోంది. అర్హత(Eligibility) కలిగిన రైతులకు అందించే పెట్టుబడి సాయం పధకం ఇది. PMKSY పధకం క్రింద ఇప్పటి వరకు 13 విడతలలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు జమచేసింది. ఇప్పుడు 14వ విడత సాయం అందించాల్సి ఉంది.అయితే జూలై 27, 2023న,14వ విడత సాయం ప్రారంభం అవుతుంది. కనుక రైతులు పి.ఎం. కిసాన్ పోర్టల్‌(P.M. Kisan Portal)లో లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయవచ్చు.

Image Credit : Betul update

పధకం లబ్దిదారుల జాబితాలో పేరు ఉందో లేదో పోర్టల్ లో జాబితా(list)ను తనిఖీ చేసిన అనంతరం ధృవీకరించుకోవచ్చు, ఎందుకంటే జాబితాలో పేరు ఉన్న వారికి మాత్రమే నగదు సాయం అందుతుంది.జాబితాలో అర్హులైన వారి పేరు ఉందా లేదా అని ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకుందాం.PM కిసాన్ యోజన పధకం క్రింద కేంద్ర ప్రభుత్వం(Central Government) అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తుంది. సంవత్సరంలో మూడుసార్లు రూ.2,000 చొప్పున 3 వాయిదాలలో రూ.6,000 ఇస్తారు. ఇప్పుడు రైతులకు 14వ విడతలో రూ.2,000 అందుతాయి.

విడుదల చేయనున్న ప్రధాని మోదీ:

14వ విడత నగదు బదిలీని ప్రధాని మోదీ(PM MODI) విడుదల చేయనున్నారు. 27 జూలై 2023న ఉదయం11 గంటలకు విడుదల అవుతాయి.14వ విడతను మోదీ రాజస్థాన్‌లోని సికార్‌(Sicar)లో జూలై 27న విడుదల చేయనున్నారు. ఆ రోజు ప్రధాని అక్కడ పర్యటించనున్నారు. అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రధాని మోదీ డెబిట్ పద్దతిలో నగదు సాయం 14వ విడత వాయిదాలను బటన్(Button) నొక్కడం ద్వారా రైతుల ఖాతాలకు మళ్ళిస్తారు.అక్కడ ఉన్న PMKSY లబ్ధిదారులతో కూడా మాట్లాడనున్నారు.

బ్యాంకుల RDs vs పోస్ట్ ఆఫీస్ RDs: ఏది అధిక వడ్డీ రేటును అందిస్తోంది…

రైతులు PMKSY లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను ఈ విధంగా తనిఖీ చేసుకోవచ్చు :

దశ 1 : లబ్ధిదారుల జాబితాలో మీ పేరును తనిఖీ(inspection) చేయడానికి pmkisan.gov.in ని సందర్శించండి. లబ్ధిదారుల జాబితా ఎంపికపై క్లిక్ చేయండి.

దశ 2 : మీ రాష్ట్రం, జిల్లా, మండలం (ఇతర రాష్ట్రాల వారైతే తహసీల్/బ్లాక్) మరియు గ్రామాన్ని నమోదు చేయండి. ఆపై “వివరాలను పొందండి”     మీద క్లిక్ చేయండి.ఇది లబ్ధిదారు(beneficiaries)ల జాబితాను ప్రదర్శిస్తుంది.ఆ తరువాత జాబితాలో మీ పేరు ఉన్నదీ లేనిది తనీఖీ చేసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.