Indigo Airlines : గాలిలోనే ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు ప్రయత్నించిన ప్రయాణీకుడు

విమానం గాలిలో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తీయడానికి ప్రయత్నించాడు ఓ ప్రయాణీకుడు. అతనిపై కేసు నమోదు చేసినారు పోలీసులు. ఇటీవల కాలంలో ఇలాంటి విపరీత ధోరణులకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రయాణీకులు

నాగ్‌పూర్ నుండి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో సెప్టెంబర్ 30 న స్వప్నిల్ హోలీ అనే వ్యక్తి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను టేకాఫ్ కంటే ముందుగా గాలిలోనే తెరవడానికి ప్రయత్నించాడని బెంగళూరు పోలీసులు పేర్కొన్నారు. ఎయిర్‌లైన్ సిబ్బంది ఫిర్యాదు (complaint) మేరకు అతడిని అరెస్టు చేశారు.

నాగ్ పూర్ నుండి బెంగళూరుకు వెళ్లే ఇండిగో ఫ్లైట్ 6E 6803 ను స్వప్నిల్ హోలీ అనే ప్రయాణీకుడు సెప్టెంబర్ 30న రాత్రి 10 గంటలకు ఎక్కాడు.

పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, స్వప్నిల్ హోలీ అనే ప్రయాణీకుడు విమానం యొక్క అత్యవసర ద్వారం (Emergency door) పక్కన కూర్చున్నాడు. టేకాఫ్‌ జరిగే ముందు, విమాన సిబ్బంది ప్రయాణీకులకు సమాచారం ఇస్తుండగా, ఆ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించాడు.

రాత్రి 11.55 గంటలకు బెంగళూరు లోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) లో విమానం దిగిన తర్వాత , అతనిని ఎయిర్‌లైన్ సిబ్బంది పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

Indigo Airlines: A passenger tried to open the emergency door in mid-air
Image Credit : Asianet Newsable

పోలీసులు తెలిపిన ప్రకారం స్వప్నిల్ హోలీ అక్టోబర్ 1న విమానంలో బ్యాంకాక్ వెళ్ల వలసి ఉంది. ఎయిర్‌లైన్ సిబ్బంది చేసిన ఫిర్యాదు ఆధారంగా, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రత (Personal safety) కు హాని కలిగించే చట్టం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఘటనకు పాల్పడిన నిందితుడైన ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు.

గాలిలో విమానంలోని అత్యవసర మార్గాన్ని తెరవడానికి వికృత ప్రయాణీకులు ప్రయత్నించిన మొదటి సంఘటన కాదు. బిస్వజిత్ దేబ్‌నాథ్ అనే ప్రయాణీకుడు సెప్టెంబర్ 21న ఇండిగో విమానం గాలిలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను బలవంతం (forced) గా తెరవాలని ప్రయత్నించగా ఇతర ప్రయాణీకులు అడ్డుకున్నారు, అనంతరం అతనిని అరెస్టు చేశారు.

Also Read : Indira Gandhi International Airport: ప్రయాణీకుల కోసం మరో సౌకర్యం..

ప్రయాణీకుల బ్యాగులను తనిఖీ చేస్తూ డబ్బు దొంగిలిస్తున్న ఎయిర్ పోర్ట్ సిబ్బంది

సెప్టెంబరు 20న కూడా ఇలాంటి సంఘటనే ఢిల్లీ నుండి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణీకుడు రాత్రి సమయంలో టేకాఫ్ చేయడానికి ముందు అత్యవసర ప్రవేశ ద్వారం కవర్‌ను తెరవడానికి ప్రయత్నించాడు.

ఇదిలావుండగా, భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో లోని కొన్ని విమానాలలో ప్రయాణీకుల లోడ్ ఫ్యాక్టర్‌లో 56% మేరకు కార్పొరేట్ ట్రాఫిక్‌లో స్పైక్‌ను చూస్తోందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ సెప్టెంబర్‌లో తెలిపారు . ఇండిగో విమానయాన సంస్థ తన కొత్త 6E ఈట్స్ మెనూని అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల్లో సెప్టెంబర్ 1నుండి ప్రారంభించింది. చికెన్ జంగ్లీ శాండ్‌విచ్, 6E ‘చాయిస్ ఆఫ్ ది డే’ లాంటి జనాదరణ (Popularity) కలిగిన సాంప్రదాయ (traditional) క ఐటెమ్‌లను కొనసాగిస్తూ, ఫేమస్ రెడీ-టు-ఈట్ మీల్స్‌తో పాటు కొత్త ప్రాంతీయ (Regional)   రుచికరమైన వంటకాలతో కూడిన ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.

Comments are closed.