IRCTC Tour Package : తెలుగువారి కోసం IRCTC “పుణ్యక్షేత్ర యాత్ర”.. ధర కూడా తక్కువే..!

ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ "పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ఓ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో కాశీ, గయ, పూరీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను దర్శించుకోవటానికి వీలు కల్పిస్తోంది.

IRCTC Tour Package : వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్లాలనుకునే తెలుగు వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక ట్రావెల్ ప్యాకేజీని ప్రకటించింది. పుణ్యక్షేత్ర యాత్రగా పిలువబడే ఈ యాత్ర, పూరీ జగన్నాథునితో మొదలై, కాశీ విశేషేశ్వరుని దర్శనంతో ముగుస్తుంది, తెలుగు రాష్ట్రాల్లోని అనేక పుణ్యక్షేత్ర ప్రదేశాలతో ఈ ప్యాకేజీ ఉంటుంది

ఈ తీర్థయాత్ర మొత్తం రైలు ప్రయాణంలో ఉంటుంది. తొమ్మిది రాత్రులు, పది పగళ్లు సాగే ఈ ప్రయాణం సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, పెందుర్తి, విశాఖపట్నం మరియు విజయనగరం స్టేషన్‌లతో కాజీపేట మరియు ఖమ్మంలను కలుపుతుంది. ఈ విహారయాత్రను ఎంచుకున్న భక్తులు నిర్ణీత ప్రదేశాలలోఈ రైలు ఎక్కవచ్చు.

10 రోజుల పర్యటన ఎలా ఉంటుంది :

1 వ రోజు : సికింద్రాబాద్‌లో తొలిరోజు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ రైలు కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మరియు సామర్లకోటలో ఆగుతుంది, రెండవ రోజు పెందుర్తి మరియు విజయనగరం వరకు కొనసాగుతుంది.

2 వ రోజు : ఉదయం 9 గంటలకు మల్తీపట్‌పూర్‌కు చేరుకుంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్​ నుంచి పూరీలో బస చేయాల్సి ఉంటుంది. మీరు టిఫిన్ మరియు లంచ్‌ చేసిన తర్వాత జగన్నాథుడిని దర్శించుకోండి. రెండో రాత్రి పూరీలో బస చేయాలి.

3 వ రోజు : ఉదయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయాన్ని సందర్శించే ముందు పూరీలో అల్పాహారం తీసుకోండి. ఆ తర్వాత, మీరు మల్తీపట్‌పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. ఇక్కడి నుండి మనం గయకు వెళ్లాలి.

4 వ రోజు : ఉదయం సుమారు 8:30 గంటలకు గయకు చేరుకుని, హోటల్‌లో బస చేసి, టిఫిన్ తిని, విష్ణుపాద ఆలయాన్ని సందర్శించండి. ఆ తర్వాత కాశీకి వెళ్లాలి.

5 వ రోజు : ఉదయం 6 గంటలకు కాశీ చేరుకుంటారు. అల్పాహారం తీసుకోవడానికి మీరు తప్పనిసరిగా హోటల్ నుండి బస్సులో వెళ్లాలి. సాయంత్రం వేళల్లో గంగా ఆరతి చూడవచ్చు. వారణాసిలో రాత్రి బస చేస్తారు.

IRCTC Tour Package

6 వ రోజు : అల్పాహారం తర్వాత హోటల్ నుండి బయటకు వెళ్లి, కాశీలోని ఇతర ప్రముఖ దేవాలయాలు మరియు ఘాట్‌లను సందర్శించండి. రాత్రి భోజనం తర్వాత, వారణాసి నుండి అయోధ్యకు వెళ్లండి.

7 వ రోజు : ఏడో రోజు బాల రామయ్య దర్శనం కోసం అయోధ్యకు చేరుకుంటారు. అక్కడ బాల రామయ్య దర్శనం, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. ఆ రోజు సాయంత్రం సరయూ హారతిని దర్శించుకుని రాత్రి అయోధ్యలోనే భోజనం తిని ప్రయోగకు స్టార్ట్ అవుతారు.

8 వ రోజు : ఎనిమిదో రోజు ఉదయం ప్రయాగ్‌రాజ్‌ చేరుకుంటారు. ఇక్కడ అల్పాహారం తీసుకుని త్రివేణి సంగమం, హనుమాన్​ ఆలయం, శంకర్‌ విమన్‌ మండపాన్ని దర్శించుకోవాలి. దీంతో పుణ్యక్షేత్ర యాత్రలోని పుణ్యక్షేత్రాల దర్శనం పూర్తి అవుతుంది.

9 వ రోజు : ఈ యాత్రలో 9 వ రోజు విజయనగరం, పెందుర్తి, సామర్లకోటకు రైలు చేరుకుంటుంది.

10 వ రోజు : పదో రోజు రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, కాజీపేట ప్రాంతాల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్‌ చేరుకోవటంతో పుణ్యక్షేత్ర దర్శనం యాత్ర ముగుస్తుంది.

ఈ టూర్ ప్యాకేజీ ఛార్జీలు :

కంఫర్ట్ టికెట్ ధర రూ.33,955 కాగా, స్టాండర్డ్ టికెట్ ధర రూ.25,980 మరియు ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.16,525 గా ఉన్నాయి.

ప్యాకేజీలో ఏయే సదుపాయాలు ఉంటాయంటే :

ప్యాకేజీలోనే ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్, భోజన సదుపాయం ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టికెట్స్, బోటింగ్ వంటి వాటికి ప్రయాణీకులే సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలనుకుంటే పర్యాటకులే సొంతంగా ఖర్చు చేసుకోవాలి.

IRCTC Tour Package

Comments are closed.